News December 6, 2024
పోలీస్ కస్టడీకి పట్నం నరేందర్ రెడ్డి

TG: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని రెండు రోజుల కస్టడీకి ఇస్తూ కొడంగల్ కోర్టు తీర్పిచ్చింది. లగచర్ల కేసులో నిందితుడిగా ఉన్న ఆయనను పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అధికారులపై దాడి ఘటనలో నరేందర్ ప్రమేయం ఉందని, ఆయనను విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరడంతో కోర్టు అందుకు అంగీకరించింది.
Similar News
News February 8, 2026
ఒకే ప్రాపర్టీని మళ్లీ మళ్లీ అమ్మి.. రూ.500 కోట్ల మోసం!

ఒకే ప్రాపర్టీని మళ్లీ మళ్లీ అమ్మి ఘరానా మోసం చేశారో కంపెనీ CEO. గురుగ్రామ్(హరియాణా)లో ప్రాజెక్టు చేపట్టానని, నెలవారీ ఆదాయం ఉంటుందని ఇన్వెస్టర్లను ‘32nd Avenue’ CEO ధ్రువ్ దత్ శర్మ నమ్మించారు. ఒక్కొక్కరి నుంచి ₹కోట్లు తీసుకున్నారు. రిటర్న్స్ అడిగితే చేతులెత్తేశారు. బాధితుల ఫిర్యాదుతో ఫ్రాడ్ బయటపడింది. ధ్రువ్ ₹500 కోట్లకు పైగా మోసం చేసినట్లు పోలీసులు చెప్పారు. వెయ్యి మంది బాధితులున్నారని తెలిపారు.
News February 8, 2026
బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్‌లో 21 పోస్టులు

బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (<
News February 8, 2026
టమాటాలో కాయ పగుళ్లకు కారణం – నివారణ

టమాటా కాయ అభివృద్ధి చెందే దశలో కాయ తొడిమ వైపు, పూత చివరి వైపునకు నిలువు పగుళ్లు కనిపిస్తాయి. నీటి లభ్యతలో తేడాలు, అధిక ఉష్ణోగ్రత, వేడి వాతావరణం తర్వాత వానలు, బోరాన్ లోపం వల్ల ఈ పగుళ్లు కనిపిస్తాయి. దీని నివారణకు నేలలో తేమ సంరక్షణకు మల్చింగ్ చేపట్టాలి. నత్రజని ఎరువులను సిఫారసు మేరకే వాడాలి. పూత, పిందె దశల్లో లీటరు నీటికి డైసోడియం ఆక్టాబోరెట్ 1.25-1.5గ్రాములను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.


