News December 7, 2024

నా ఫోన్‌ను హ్యాక్ చేసి బెదిరిస్తున్నారు: శామ్ పిట్రోడా

image

తన ల్యాప్‌టాప్, స్మార్ట్ ఫోన్, సర్వర్‌లను దుండగులు హ్యాక్ చేసి బెదిరిస్తున్నారని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చీఫ్ <<13515786>>శామ్ పిట్రోడా<<>> వెల్లడించారు. క్రిప్టో కరెన్సీ రూపంలో $10K డిమాండ్ చేస్తున్నారని, లేదంటే తన ప్రతిష్ఠను దిగజార్చేలా తప్పుడు సమాచారం ప్రచారం చేస్తామంటున్నారని తెలిపారు. దీనిపై చికాగోలో ఫిర్యాదు చేస్తానన్నారు. ఏదైనా తెలియని మెయిల్, మొబైల్ నుంచి వచ్చే లింక్‌లపై క్లిక్ చేయొద్దని సూచించారు.

Similar News

News November 5, 2025

ఇతిహాసాలు క్విజ్ – 57

image

1. శబరి ఏ ఆశ్రమంలో రాముడి కోసం ఎదురుచూసింది?
2. విశ్వామిత్రుడి శిష్యులలో ‘శతానందుడు’ ఎవరి పుత్రుడు?
3. కుబేరుడు రాజధాని నగరం పేరు ఏంటి?
4. నారదుడు ఏ వాయిద్యంతో ప్రసిద్ధి చెందాడు?
5. కాలానికి అధిపతి ఎవరు?
☞ సరైన సమాధానాలను సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
<<-se>>#Ithihasaluquiz<<>>

News November 5, 2025

నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలు

image

తిరుపతిలోని నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో 21 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో ఎంఫిల్, పీహెచ్‌డీ, పీజీ, NET, SLET, SET, MLISC, B.Ed, డిగ్రీ, ఇంటర్ , టెన్త్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://nsktu.ac.in

News November 5, 2025

APPLY NOW : PGIMERలో ఉద్యోగాలు

image

చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(<>PGIMER<<>>)13 ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 20 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఇంటర్, BSc, MBBS/BDS, బీటెక్, MSc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://pgimer.edu.in/