News December 7, 2024
నా ఫోన్‌ను హ్యాక్ చేసి బెదిరిస్తున్నారు: శామ్ పిట్రోడా
తన ల్యాప్‌టాప్, స్మార్ట్ ఫోన్, సర్వర్‌లను దుండగులు హ్యాక్ చేసి బెదిరిస్తున్నారని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చీఫ్ <<13515786>>శామ్ పిట్రోడా<<>> వెల్లడించారు. క్రిప్టో కరెన్సీ రూపంలో $10K డిమాండ్ చేస్తున్నారని, లేదంటే తన ప్రతిష్ఠను దిగజార్చేలా తప్పుడు సమాచారం ప్రచారం చేస్తామంటున్నారని తెలిపారు. దీనిపై చికాగోలో ఫిర్యాదు చేస్తానన్నారు. ఏదైనా తెలియని మెయిల్, మొబైల్ నుంచి వచ్చే లింక్‌లపై క్లిక్ చేయొద్దని సూచించారు.
Similar News
News January 17, 2025
మళ్లీ పెరిగిన బంగారం ధరలు
ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 10 గ్రా. 24 క్యారెట్ల గోల్డ్ రూ.650 పెరిగి రూ.81,270కి చేరింది. 22 క్యారెట్ల పసిడి రూ.600 పెరిగి రూ.74,500 పలుకుతోంది. కేజీ వెండి రూ.1000 పెరిగి రూ.1,04,000కు చేరింది.
News January 17, 2025
బీదర్ దొంగల కోసం కొనసాగుతున్న పోలీసుల వేట
<<15173290>>బీదర్ దొంగల కోసం<<>> పోలీసులు వేట కొనసాగుతోంది. నిందితులను ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌కు చెందిన వారిగా గుర్తించారు. వారు హైదరాబాద్ నుంచి అడ్డదారుల్లో రాయ్‌పూర్‌కు పారిపోయినట్లు అనుమానిస్తున్నారు. నిన్న బీదర్‌లో భద్రతా సిబ్బందిపై కాల్పులు జరిపి ఏటీఎం డబ్బులు దొంగిలించిన నిందితులు సాయంత్రం హైదరాబాద్‌కు వచ్చారు. అఫ్జల్ గంజ్‌లో ట్రావెల్స్ సిబ్బందిపై కాల్పులు జరిపి పరారయ్యారు.
News January 17, 2025
‘సంక్రాంతికి వస్తున్నాం’: మూడు రోజుల్లో రూ.106 కోట్లు
విక్టరీ వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా రికార్డు కలెక్షన్లు రాబడుతోంది. ఈ చిత్రం మూడు రోజుల్లోనే రూ.106 కోట్లు కలెక్ట్ చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. ‘ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్.. విక్టరీ వెంకటేశ్’ అంటూ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు.