News December 7, 2024

అవుట్ కాకపోయినా వెళ్లిపోయిన మిచెల్ మార్ష్!

image

అడిలైడ్ టెస్టులో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. అశ్విన్ బౌలింగ్‌లో మార్ష్ డిఫెండ్ చేసేందుకు యత్నించగా బంతి బ్యాట్‌ను తాకుతున్నట్లుగా వెళ్లి పంత్ చేతిలో పడింది. భారత్ అప్పీల్ చేయగా అంపైర్ అవుట్ ఇచ్చేశారు. మార్ష్ కూడా సైలెంట్‌గా పెవిలియన్‌కు వెళ్లిపోయారు. తీరా రీప్లేలో చూస్తే బంతి బ్యాట్‌కు తగలనేలేదని తేలింది. బ్యాట్ తన ప్యాడ్‌కు తాకగా బంతికి తాకినట్లు మార్ష్ భావించి వెళ్లిపోయారు.

Similar News

News January 2, 2026

‘గ్రోక్’ అశ్లీల కంటెంట్‌పై కేంద్రం సీరియస్

image

Xలో ‘గ్రోక్’ అశ్లీల ట్రెండింగ్‌పై కేంద్రం సీరియస్ అయింది. అలాంటి కంటెంట్‌ను వెంటనే తొలగించాలంటూ సదరు సంస్థను ఆదేశించింది. ఇటీవల గ్రోక్ సాయంతో మహిళల ఫొటోలను బికినీలోకి మారుస్తున్న ట్రెండ్‌పై సర్వత్రా <<18744158>>ఆందోళన<<>> వ్యక్తమైన విషయం తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన కేంద్రం అసభ్యకర, నగ్న, లైంగిక చర్యలను ప్రోత్సహించే కంటెంట్‌ను తొలగించాలని Xకు లేఖ రాసింది. AIని ఇలా దుర్వినియోగపర్చడం సరికాదని సూచించింది.

News January 2, 2026

రేపు అసెంబ్లీలో కృష్ణా జలాలపై ప్రభుత్వం PPT

image

తెలంగాణ అసెంబ్లీలో కృష్ణా జలాలపై ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్యాహ్నం 12 గంటలకు ప్రజెంటేషన్ ఇస్తారు. కృష్ణా జలాలు, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై బీఆర్ఎస్ ఆరోపణలను తిప్పికొట్టేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇవాళ సభకు హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వ తీరును నిరసిస్తూ సమావేశాలను బహిష్కరించారు.

News January 2, 2026

వాస్తు మన సౌభాగ్యానికి తొలి మెట్టు

image

వాస్తు నియమాలు పాటించే ఇంట్లో సిరిసంపదలకు లోటుండదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. సరైన వాస్తు వల్ల కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడి, మనసులో ప్రభావవంతమైన ఆలోచనలు కలుగుతాయని అంటున్నారు. ‘ఇవి కొత్త అవకాశాలను సృష్టిస్తాయి. ఆదాయ వృద్ధికి బాటలు వేసి సకల సౌకర్యాలు, సదుపాయాలు కల్పిస్తాయి. అంతిమంగా ఇవి ఆనందాన్ని, మానసిక సంతృప్తిని అందిస్తాయి. వాస్తు అభ్యున్నతికి ఆధారం’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>