News December 7, 2024
మాయలఫకీర్‌లా రేవంత్ డ్రామాలు: జేపీ నడ్డా

TG: రేవంత్ ప్రభుత్వం ఏడాదిగా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తోందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా విమర్శించారు. సరూర్ నగర్‌లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. మాయలఫకీర్‌లా రేవంత్ డ్రామాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. హామీల అమలులోనూ రేవంత్ ప్రభుత్వం విఫలమైందన్నారు. తెలంగాణలో మార్పు బీజేపీతోనే సాధ్యమవుతుందని, కాంగ్రెస్ పార్టీ ఒక పరాన్నజీవి అని మండిపడ్డారు.
Similar News
News November 5, 2025
కొత్తగా 8 జిల్లాల ఏర్పాటుకు సూచనలు: అనగాని

AP: కొత్తగా 8 జిల్లాల ఏర్పాటుకు పలు వర్గాల నుంచి సూచనలు వచ్చాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. అలాగే కొత్త రెవెన్యూ డివిజన్ల కోసమూ వినతులు అందినట్లు చెప్పారు. పాలనా సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకొనే వీటిపై నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. CM సూచనతో అల్లూరి(D)లో ప్రత్యేక అభివృద్ధి మండలి ఏర్పాటుపై ఆలోచనలు చేస్తున్నామన్నారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అక్రమాలపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
News November 5, 2025
జనవరిలో గగన్‌యాన్ ప్రాజెక్టు అన్‌క్రూడ్ మిషన్: ISRO ఛైర్మన్

ఇండియా ‘మానవ సహిత గగన్‌యాన్’లో భాగంగా అన్‌క్రూడ్ మిషన్‌ను జనవరిలో చేపట్టే అవకాశముందని ఇస్రో ఛైర్మన్ నారాయణన్ తెలిపారు. ఇప్పటికే 8వేల టెస్టులు నిర్వహించామన్నారు. 2027లో మానవ సహిత గగన్‌యాన్‌కు ముందు 3 అన్‌క్రూడ్ మిషన్లను చేపడతామని వివరించారు. భారత అంతరిక్ష కేంద్ర ఫస్ట్ మాడ్యూల్‌ను 2028లో లాంచ్ చేస్తామన్నారు. నాసాతో కలిసి రూపొందించిన NISAR శాటిలైట్ ఆపరేషన్‌పై శుక్రవారం ప్రకటన చేయనున్నట్లు చెప్పారు.
News November 5, 2025
ప్రధాని మోదీని కలిసిన వరల్డ్ కప్ విన్నర్లు

వన్డే వరల్డ్ కప్ గెలిచిన భారత మహిళల జట్టు ప్రధాని నరేంద్ర మోదీని కలిసింది. ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ హోటల్ నుంచి ప్రత్యేక బస్సులో PM నివాసానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఒక్కో ప్లేయర్‌ను ప్రత్యేకంగా మోదీ అభినందించారు. తర్వాత వారిని సన్మానించారు. బంగ్లాదేశ్‌తో మ్యాచులో గాయపడిన ప్రతికా రావల్ వీల్‌ఛైర్‌లో రావడం గమనార్హం. అంతకుముందు ముంబై నుంచి ఢిల్లీకి వచ్చిన ప్లేయర్లకు ఘన స్వాగతం లభించింది.


