News December 8, 2024
2047 నాటికి 30 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా భారత్: ప్రధాన్

దేశ ఆర్థిక వ్యవస్థ 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. జంషెడ్పూర్ XLRI మేనేజ్మెంట్ స్కూల్ ప్లాటినం జూబ్లీ ఉత్సవాల్లో ఆయన మాట్లాడారు. $3 ట్రిలియన్ల పరిమాణంతో భారత్ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోందన్నారు. మరో 3 ఏళ్లలో $5 ట్రిలియన్లతో 3వ స్థానానికి చేరుతుందని, 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల వ్యవస్థగా నిలుస్తుందన్నారు.
Similar News
News January 24, 2026
‘రథ సప్తమి’ ఎందుకు జరుపుకొంటారు?

సూర్యుడి గమనం దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి మారే క్రమంలో మాఘ శుద్ధ సప్తమి నాడు ఆయన రథం ఉత్తర దిశగా ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. అందుకే ఈ రోజును రథసప్తమి అంటారు. అలాగే సూర్యుడు 7 గుర్రాల రథంపై జగత్తుకు దర్శనమిచ్చింది కూడా ఈరోజే. నేటి నుంచి సూర్య కిరణాలు భూమికి దగ్గరగా వచ్చి ప్రాణికోటికి చైతన్యం, జఠరాగ్ని పెరుగుతాయని నమ్ముతారు. పాపాలను హరింపజేసే తిథి సూర్యారాధనకు అతి ముఖ్యమైనదిగా పరిగణిస్తారు.
News January 24, 2026
ఆర్టీసీ బంపర్ ఆఫర్.. ₹3,500తో గోవా టూర్

TGSRTC ప్రత్యేక లోబడ్జెట్ టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చింది. FEB 2వ వారంలో వరుస సెలవులతో గోవా టూర్‌ను ప్రకటించింది. లగ్జరీ బస్సులో ఒక్కరు ₹3,500కే 3 నైట్స్, 4 డేస్ ప్రయాణంతో గోవా టూర్ చేయొచ్చు. గోవాతో పాటు హంపీ, తుల్జాపూర్‌ల సందర్శనా ఉంటుంది. అలాగే ₹3వేలతోనే పండరీ పూర్, గానుగాపూర్, కొల్హాపూర్, తుల్జాపూర్ ఆలయాలను దర్శించుకోవచ్చు. వివరాల కోసం 9391072283/9063401072 నంబర్లకు ఫోన్ చేయొచ్చు.
News January 24, 2026
గణతంత్ర వేడుకల్లో దళనాయకిగా సిమ్రన్ బాలా

జమ్ము కశ్మీర్ అసిస్టెంట్ కమాండెంట్‌గా పని చేస్తున్న సిమ్రన్ బాలా ఆల్ మేల్ CRPF దళానికి జనవరి 26న జరిగే పరేడ్‌లోనాయకత్వం వహించనున్నారు. ఈ ఘనత పొందిన మొదటి మహిళా అధికారిణి బాలా. 2023 మేలో మొదటి ప్రయత్నంలోనే దేశస్థాయిలో 82వ ర్యాంకును సాధించి CRPFలో చేరారు. పరేడ్ రిహార్సల్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన, శిక్షణ, ఫీల్డ్ పోస్టింగ్‌లలో విశిష్ట రికార్డు సొంతం కావడం వల్లే ఈ అవకాశం దక్కింది.


