News December 8, 2024

అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలం: KCR

image

TG: ఏడాది పాలనలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందని KCR ధ్వజమెత్తారు. గురుకులాలు, విద్యారంగం, మూసీ, హైడ్రా, నిర్భంద పాలనపై BRS ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎండగట్టాలని సూచించారు. ఫిబ్రవరిలో నిర్వహించే బహిరంగ సభలో ప్రభుత్వ వైఖరిని నిలదీస్తామని చెప్పారు. మార్చిలో BRSలో కమిటీలు ఏర్పాటు చేస్తామని, ఆ తర్వాత సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడతామని వివరించారు గులాబీ దళపతి.

Similar News

News December 27, 2024

విద్యుత్ ఛార్జీల బాదుడుపై నేడు వైసీపీ పోరుబాట

image

AP: కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా వైసీపీ ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. అన్ని జిల్లాలు, నియోజకవర్గ కేంద్రాల్లో విద్యుత్ శాఖ కార్యాలయాల వద్ద నేతలు, కార్యకర్తలు ర్యాలీలు నిర్వహిస్తారు. కరెంట్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని అధికారులకు వినతిపత్రాలు సమర్పిస్తారు. ప్రజలపై రూ.15,485 కోట్ల భారాన్ని ప్రభుత్వం మోపిందని వైసీపీ ఆరోపిస్తోంది.

News December 27, 2024

వారం రోజులు సంతాప దినాలు

image

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం నేపథ్యంలో కేంద్రం వారం రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. ఇవాళ అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను రద్దు చేసింది. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇవాళ కేంద్ర క్యాబినెట్ సమావేశం నిర్వహించి ఆయనకు సంతాపం తెలపనుంది.

News December 27, 2024

తెలంగాణ వాసుల కోరిక నెరవేర్చిన మన్మోహన్

image

తెలంగాణ ప్రజల ఎన్నో దశాబ్దాల ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ను నెరవేర్చింది మన్మోహనే. నాడు ప్రధానిగా ఉన్న ఆయన ఎంతో రాజనీతితో వ్యవహరించారు. విభజనకు అనుకూల, అననుకూల నేతలతో ఎన్నో చర్చలు చేశారు. సామరస్యంగా విభజన చేయడానికి ఎంతో కృషి చేశారు. రాష్ట్ర విభజన ఆవశ్యకతను గుర్తిస్తూనే ఆ తర్వాత వచ్చే సమస్యలను ప్రస్తావించారు. విభజిత APకి ప్రత్యేక హోదా ఇవ్వాలని తొలుత చెప్పింది ఈయనే. అయితే తర్వాత NDA పట్టించుకోలేదు.