News December 8, 2024
అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలం: KCR
TG: ఏడాది పాలనలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందని KCR ధ్వజమెత్తారు. గురుకులాలు, విద్యారంగం, మూసీ, హైడ్రా, నిర్భంద పాలనపై BRS ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎండగట్టాలని సూచించారు. ఫిబ్రవరిలో నిర్వహించే బహిరంగ సభలో ప్రభుత్వ వైఖరిని నిలదీస్తామని చెప్పారు. మార్చిలో BRSలో కమిటీలు ఏర్పాటు చేస్తామని, ఆ తర్వాత సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడతామని వివరించారు గులాబీ దళపతి.
Similar News
News January 25, 2025
రేపు వైన్ షాపులు, మాంసం దుకాణాలు బంద్
గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో రేపు వైన్ షాపులు, మాంసం దుకాణాలు బంద్ కానున్నాయి. ఈ రోజు రాత్రి నుంచి ఎలాంటి జంతువులను వధించరాదని, అన్ని చికెన్, మటన్, చేపల మార్కెట్లు రేపు మూసివేయాలని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సూచించింది. ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. చాలా పట్టణాల్లో ఇవే తరహా ఆదేశాలు జారీ అయ్యాయి.
News January 25, 2025
విజయసాయి ఇంటికి వైసీపీ ఎంపీ
AP: ఎంపీ పదవికి రాజీనామా ప్రకటించిన విజయసాయి ఇంటికి తిరుపతి YCP ఎంపీ గురుమూర్తి వెళ్లారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘విజయసాయి రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించడంతో షాక్ అయ్యా. ఎందుకీ నిర్ణయం తీసుకున్నారో తెలుసుకోవడానికి వ్యక్తిగతంగా వచ్చా. జగన్ అన్నను మళ్లీ సీఎంగా చేసుకోవడానికి కలిసికట్టుగా కృషి చేద్దామని కోరా. దానిపై ఆలోచిద్దాం అని చెప్పారు’ అని గురుమూర్తి వెల్లడించారు.
News January 25, 2025
BREAKING: VSR రాజీనామా
AP: వైసీపీ కీలక నేత, జగన్ సన్నిహితుడు విజయసాయి రెడ్డి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఢిల్లీలో రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌ను కలిసి రాజీనామా పత్రాన్ని అందజేశారు. కాగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు నిన్న VSR ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఈయన పదవీకాలం 2028 వరకు ఉంది.