News December 9, 2024

శ్రీవారి దర్శనానికి 6 గంటల టైమ్

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని ఒక కంపార్ట్‌మెంటులో భక్తులు వేచి ఉన్నారు. నిన్న ఏడుకొండలవాడిని 73,107 మంది దర్శించుకున్నారు. 22,721 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.58 కోట్లు లభించింది.

Similar News

News February 17, 2026

కాగజ్‌నగర్, జహీరాబాద్ మున్సిపాలిటీలు కాంగ్రెస్ వశం

image

TG: కాగజ్‌నగర్ మున్సిపల్ పీఠాన్ని BJP మద్దతుతో కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఛైర్ పర్సన్‌గా షాహిన్ సుల్తానా(INC), వైస్ ఛైర్ పర్సన్‌గా లావణ్య(BJP) ఎన్నికయ్యారు. జహీరాబాద్ మున్సిపాలిటీ ఛైర్మన్‌గా కాంగ్రెస్ అభ్యర్థి యూనస్, వైస్ ఛైర్మన్‌గా శిరీష ఎన్నికయ్యారు. మరోవైపు ఖానాపూర్, ఇబ్రహీంపట్నం ఛైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. కాగా ఎన్నికల ప్రక్రియ ముగియడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ కోడ్‌ను ఎత్తివేసింది.

News February 17, 2026

మెన్‌స్ట్రువల్ కప్ ఎలా ఎంచుకోవాలంటే?

image

పీరియడ్స్‌లో నాణ్యత లేని ప్యాడ్స్ వాడటం వల్ల దురద, రాషెస్ వస్తాయి. వీటికి బదులు మెన్‌స్ట్రువల్ కప్ వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. సిలికాన్‌తో తయారయ్యే దీన్ని 10-12 గంటల వరకు వాడొచ్చంటున్నారు. నాప్కిన్స్, టాంపూన్స్ కంటే ఎక్కువ బ్లడ్ హోల్డ్ చేస్తుంది. ఒక్కసారి కొంటే పదేళ్ల వరకు వాడొచ్చు. కొనేముందు వయసు, సర్విక్ లెంగ్త్, పీరియడ్ ఫ్లో, ఫ్లెక్సిబిలిటీ, డెలివరీ టైప్ వంటివి దృష్టిలో పెట్టుకోవాలి.

News February 17, 2026

రాగి పంటకు నీరు అందించడంలో జాగ్రత్తలు

image

రాగి పంటకు నీటిని అందించే విషయంలో రైతులు కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలి. నాట్లు వేసిన రాగి పొలంలో పైరు బాగా వేర్లు తొడిగే వరకు అంటే సుమారు 10 రోజుల వరకు నీరు పెట్టకూడదని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. రాగి పంట సాధారణంగా వర్షాధార పంట అయినప్పటికీ కీలక దశలైన మొలకెత్తే దశ, పూత, గింజ పాలు పోసుకునే దశల్లో నీటి తడులను ఇస్తే దిగుబడి బాగుంటుందని నిపుణులు సలహా ఇస్తున్నారు.