News December 9, 2024
రాజ్యాంగంపై చర్చ: మోదీ రిప్లై అప్పుడే

పార్లమెంటు ఉభయ సభల్లో ఈ వారం రాజ్యాంగంపై ప్రత్యేక చర్చ ప్రారంభంకానుంది. శుక్రవారం లోక్‌సభలో రాజ్‌నాథ్ సింగ్ చర్చను ప్రారంభించనున్నారు. అధికార, విపక్ష సభ్యుల ప్రసంగాల అనంతరం చివరగా శనివారం PM మోదీ చర్చపై సమాధానమిస్తారు. రాజ్యసభలో 16న అమిత్ షా చర్చను ప్రారంభిస్తారు. 17న మోదీ రిప్లై ఇస్తారు. ఇటీవల రాజ్యాంగం చుట్టూ రాజకీయాలు జోరందుకోవడంతో చర్చకు ప్రాధాన్యం ఏర్పడింది.
Similar News
News January 14, 2026
ఒకప్పుడు ₹2వేల కోట్ల ఆస్తులు.. కానీ ఇప్పుడు..!

దర్భాంగా ఫ్యామిలీ (బిహార్) దేశంలోని రిచెస్ట్ రాయల్ ఫ్యామిలీలలో ఒకటి. ఈ ఫ్యామిలీ చివరి మహారాణి కామసుందరి దేవి(96) ఈ నెల 12న చనిపోయారు. ఆమె భర్త, చివరి మహారాజు కామేశ్వర్ సింగ్ 1962లో చనిపోగా, అప్పుడు ఈ ఫ్యామిలీ ఆస్తుల విలువ ₹2,000Cr(ప్రస్తుత వాల్యూ ₹4లక్షల కోట్లు). ఇందులో ఇప్పుడు 2% కంటే తక్కువే ఉన్నట్లు సమాచారం. 1962 IND-CHN యుద్ధం సమయంలో ఈ ఫ్యామిలీ ప్రభుత్వానికి 600kgs గోల్డ్ సాయం చేసింది.
News January 14, 2026
APPLY NOW: BOB క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

BOB క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్‌లో వివిధ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ, MBA/CFA/CA,M.COM ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తును careers@bobcaps.in ఈమెయిల్‌కు పంపాలి. వెబ్సైట్: https://www.bobcaps.in
News January 14, 2026
నేడే జ్యోతి రూపంలో అయ్యప్ప స్వామి దర్శనం

మకర సంక్రాంతి సందర్భంగా శబరిమలలో నేడు మకర జ్యోతి దర్శనమివ్వనుంది. ఈ దివ్య జ్యోతిని సాక్షాత్తు అయ్యప్ప స్వామి స్వరూపంగా భావిస్తారు. స్వామియే తన భక్తులను ఆశీర్వదించడానికి జ్యోతి రూపంలో వచ్చారని విశ్వసిస్తారు. కఠినమైన దీక్షలో ఉన్న మాలధారులు ఈ జ్యోతిని వీక్షించిన తర్వాతే తమ దీక్షను విరమిస్తారు. ఈ పవిత్ర దర్శనం భక్తుల మనసులకు ప్రశాంతతను, పుణ్యఫలాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతారు.


