News December 9, 2024

రాజ్యాంగంపై చర్చ: మోదీ రిప్లై అప్పుడే

image

పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌ల్లో ఈ వారం రాజ్యాంగంపై ప్ర‌త్యేక చ‌ర్చ ప్రారంభంకానుంది. శుక్ర‌వారం లోక్‌స‌భ‌లో రాజ్‌నాథ్ సింగ్ చ‌ర్చ‌ను ప్రారంభించ‌నున్నారు. అధికార‌, విప‌క్ష స‌భ్యుల ప్ర‌సంగాల‌ అనంత‌రం చివ‌ర‌గా శ‌నివారం PM మోదీ చ‌ర్చ‌పై స‌మాధాన‌మిస్తారు. రాజ్య‌స‌భ‌లో 16న అమిత్ షా చ‌ర్చ‌ను ప్రారంభిస్తారు. 17న మోదీ రిప్లై ఇస్తారు. ఇటీవల రాజ్యాంగం చుట్టూ రాజ‌కీయాలు జోరందుకోవ‌డంతో చ‌ర్చ‌కు ప్రాధాన్యం ఏర్ప‌డింది.

Similar News

News January 13, 2025

ఛాంపియన్స్ ట్రోఫీ: సౌతాఫ్రికా టీమ్ ఇదే

image

ఛాంపియన్స్ ట్రోఫీ-2025 కోసం సౌతాఫ్రికా టీంను ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది.
టీమ్: టెంబా బవుమా (C), ట్రిస్టన్ స్టబ్స్, టోనీ డి జోర్జి, వన్ డర్ డస్సెన్, రికెల్టన్, డేవిడ్ మిల్లర్, మార్క్రమ్, ముల్డర్, క్లాసెన్, కేశవ్ మహారాజ్, షంసీ, ఎంగిడి, మార్కో జాన్సెన్, కగిసో రబాడ, నోర్ట్జే.

News January 13, 2025

తల్లి ఫోన్లో పోర్న్ వీడియో చూసి దారుణం!

image

AP: అనకాపల్లి జిల్లా ఏటికొప్పాకలో ఐదేళ్ల చిన్నారిని 13 ఏళ్ల బాలుడు (8వ తరగతి) అత్యాచారం చేశాడు. శనివారం ఇంటి సమీపంలో ఆడుకుంటున్న బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. తల్లి ఫోన్లో పోర్న్ వీడియో చూసి అత్యాచారానికి పాల్పడ్డట్లు బాలుడు పోలీసులతో చెప్పినట్లు సమాచారం.

News January 13, 2025

TTDలో సమన్వయ లోపం లేదు: ఛైర్మన్, ఈవో

image

తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని భక్తులకు TTD ఛైర్మన్ BR నాయుడు సూచించారు. ఏర్పాట్లలో లోపాలున్నాయని ప్రచారం చేయడం సరికాదని అన్నారు. TTD ఛైర్మన్, EOకు పడటం లేదని, బోర్డులో సమన్వయ లోపం ఉందంటూ జరుగుతున్న ప్రచారాన్ని EO శ్యామలరావు ఖండించారు. తిరుపతిలోని ఓ స్కూల్ వద్ద జరిగిన ఘటనను తిరుమలలో జరిగినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.