News December 9, 2024
ట్విస్ట్.. ఇద్దరు మంత్రులకు ఒకే నంబర్ నుంచి బెదిరింపులు

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు <<14834003>>హత్య బెదిరింపులు<<>> రావడంపై హోంమంత్రి అనిత ఆరా తీశారు. తనకు రెండు రోజుల క్రితం బెదిరింపులు వచ్చిన నంబర్ నుంచే ఈ కాల్ వచ్చినట్లు హోంమంత్రి గుర్తించారు. దీంతో ఆగంతకుడిని పట్టుకొని కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆమె ఆదేశించారు. పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. బందర్ రోడ్డు నుంచి మల్లిఖార్జున రావు అనే వ్యక్తి ఈ బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం.
Similar News
News November 12, 2025
త్వరలో ఈ జిల్లాల్లో ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలు ప్రారంభం

తెలంగాణలో ఆయిల్ పామ్ ఉత్పత్తిని పెంచేలా త్వరలో పలు ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలు ప్రారంభం కానున్నాయి. సిద్దిపేటలోని నర్మెట్టలో ఆయిల్ ఫెడ్, పెద్దపల్లిలో తిరుమల ఆయిల్ ఫ్యాక్టరీ, ఖమ్మంలో గోద్రెజ్ అగ్రోవెట్ ఫ్యాక్టరీ, వనపర్తిలో ప్రీ యూనిక్ ఫ్యాక్టరీ, ఖమ్మంలోని కల్లూరు గూడెంలో ఆయిల్‌ఫెడ్ ఫ్యాక్టరీ, గద్వాల్‌లోని బీచుపల్లిలో ఆయిల్ ఫెడ్, ములుగులో K.N.బయోసైన్సెస్ ఫ్యాక్టరీలు AUG-2026 నాటికి ప్రారంభంకానున్నాయి.
News November 12, 2025
ఆఫీసుకు 5 రోజులు రావాలన్న CEO.. 600 మంది రిజైన్

వారానికి 5 రోజులు ఆఫీసుకు రావాలన్న CEOకి ఉద్యోగులు షాకిచ్చారు. పారామౌంట్, స్కైడాన్స్ మీడియా విలీనం తర్వాత CEO డేవిడ్ ఎల్లిసన్ WFH చేస్తున్న వారందరూ వారానికి 5 రోజులు ఆఫీసుకు రావాలని ఆదేశించారు. లేదంటే బైఅవుట్(స్వచ్ఛందంగా వైదొలగడం) ఆఫర్ తీసుకోవాలని సూచించారు. దీంతో వైస్ ప్రెసిడెంట్ కంటే కింది స్థాయిలో పనిచేస్తున్న 600 మంది ఉద్యోగులు ఎల్లిసన్ ఆఫర్‌ను స్వీకరించి రిజైన్ చేశారు.
News November 12, 2025
జీరో బడ్జెట్‌తో సోలో ట్రావెలింగ్

అమ్మాయి ఒంటరిగా బయటకువెళ్తే సేఫ్‌గా వస్తుందా రాదా అనే పరిస్థితే ఇప్పటికీ ఉంది. కానీ తమిళనాడుకు చెందిన సరస్వతి నారాయణ అయ్యర్ ఒంటరిగా, జీరో బడ్జెట్‌తో దేశమంతా తిరిగేస్తూ ఫేమస్ అయ్యింది. తక్కువ లగేజ్, వెళ్లాల్సిన దారిలో లిఫ్ట్ అడగడం, కిలోమీటర్ల కొద్దీ కాలినడకన ప్రయాణం సాగిస్తూ ఈమె బడ్జెట్ సోలో ట్రావెలింగ్ చేస్తోంది. తన అనుభవాలను వివరిస్తూ యూట్యూబ్‌లో వీడియోలు పెడుతూ ఎందరికో స్ఫూర్తినిస్తోంది.


