News December 9, 2024

‘INDIA’ బాధ్యతలపై చర్చ ఎప్పుడైంది?: ఒమర్

image

INDIA కూట‌మి సార‌థ్య బాధ్య‌తలు మ‌మ‌తా బెన‌ర్జీకి ఇవ్వాల‌న్న డిమాండ్లు పెరుగుతున్న వేళ నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ ఆచితూచి అడుగులేస్తోంది. లోక్‌స‌భ ఎన్నిక‌ల తర్వాత మిత్ర‌ప‌క్షాల భేటీనే జ‌ర‌గ‌లేద‌ని, అలాంట‌ప్పుడు నాయ‌క‌త్వ మార్పుపై ఎవరు చర్చించారని JK CM ఒమ‌ర్ అబ్దుల్లా ప్ర‌శ్నించారు. స‌మావేశం నిర్వహించినప్పుడు మ‌మ‌త సార‌థ్య బాధ్య‌త‌లు కోర‌వ‌చ్చని, అప్పుడే ఈ విషయంపై చ‌ర్చ జ‌రుగుతుంద‌న్నారు.

Similar News

News December 28, 2025

సూర్య నమస్కారాలతో లాభాలివే..

image

పరమాత్మ స్వరూపమైన సూర్యుడికి సమర్పించే శక్తివంతమైన సాధనే సూర్య నమస్కారాలు. దీనివల్ల శరీరంలోని 12 చక్రాలు ఉత్తేజితమై, ప్రాణశక్తి ప్రవాహం మెరుగుపడుతుంది. సూర్య కిరణాల ప్రభావంతో మనసులో అశాంతి తొలగి, బుద్ధి ప్రకాశిస్తుంది. రోజూ నిష్టతో సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఆరోగ్యం, ఆయుష్షు, ఐశ్వర్యం సిద్ధిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంచి, మనల్ని దైవత్వానికి దగ్గర చేస్తుంది.

News December 28, 2025

గుడ్ న్యూస్.. స్కాలర్‌షిప్ దరఖాస్తు గడువు పెంపు!

image

TG: పోస్టుమెట్రిక్ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ దరఖాస్తు గడువు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 31తో గడువు ముగియనుండగా విద్యార్థుల నుంచి స్పందన లేకపోవడంతో అధికారులు ఆ దిశగా ఆలోచన చేస్తున్నారు. ఏటా సగటున 12.55 లక్షల మంది e PASS వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుంటుండగా 2025-26లో ఈ సంఖ్య 7.65 లక్షలు మాత్రమే ఉంది. గడువు పొడిగింపుపై ఎల్లుండిలోగా ఉత్తర్వులు జారీ చేసే అవకాశముంది.

News December 28, 2025

సిల్వర్ షాక్.. నెలలో ₹82,000 జంప్

image

సరిగ్గా నెల క్రితం KG వెండి ధర ₹1,92,000. ఇప్పుడది ₹2,74,000కు చేరింది. కేవలం నెలరోజుల్లోనే ₹82,000 పెరిగింది. ‘పేదవాడి బంగారం’గా పిలిచే వెండి ఇప్పుడు తానూ బంగారం బాటలోనే నడుస్తానంటోంది.. దీంతో కొనలేక సామాన్యులు.. అమ్మకాలు లేక వ్యాపారులు తలలు పట్టుకుంటున్నారు. పెళ్లిళ్ల సీజన్‌ రానుండటంతో మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్‌ తలకిందులు కావడం పక్కాగా కనిపిస్తోంది!