News December 9, 2024
‘INDIA’ బాధ్యతలపై చర్చ ఎప్పుడైంది?: ఒమర్
INDIA కూటమి సారథ్య బాధ్యతలు మమతా బెనర్జీకి ఇవ్వాలన్న డిమాండ్లు పెరుగుతున్న వేళ నేషనల్ కాన్ఫరెన్స్ ఆచితూచి అడుగులేస్తోంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత మిత్రపక్షాల భేటీనే జరగలేదని, అలాంటప్పుడు నాయకత్వ మార్పుపై ఎవరు చర్చించారని JK CM ఒమర్ అబ్దుల్లా ప్రశ్నించారు. సమావేశం నిర్వహించినప్పుడు మమత సారథ్య బాధ్యతలు కోరవచ్చని, అప్పుడే ఈ విషయంపై చర్చ జరుగుతుందన్నారు.
Similar News
News January 19, 2025
శాంసన్‌కు CTలో నో ప్లేస్.. రాజకీయ దుమారం
సంజూ శాంసన్‌ను ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయకుండా కెరీర్‌ను నాశనం చేశారని MP శశిథరూర్ ఆరోపించారు. ఈ విషయంలో KCAకు బాధ లేదా అని ప్రశ్నించారు. SMAT, VHTల మధ్య ట్రైనింగ్‌కు హాజరుకానందుకు చింతిస్తూ ఆయన లేఖ రాసినా వేటు వేశారని మండిపడ్డారు. ఈ విషయంపై KCA ప్రెసిడెంట్ జార్జ్ స్పందిస్తూ శాంసన్ క్రమశిక్షణ పాటించలేదన్నారు. VHTలో ఆడకపోవడం వల్లే జాతీయ జట్టుకు దూరమయ్యారనేది తాను చెప్పలేనని పేర్కొన్నారు.
News January 19, 2025
రియల్ హీరోస్..!
రెస్టారెంట్లలో నిత్యం వేలాది టన్నుల ఫుడ్ వేస్ట్ అవుతుంది. అలా వేస్ట్ కాకుండా ఫుడ్‌ను అన్నార్థులకు అందించేందుకు కొన్ని NGOలు ముందుకొస్తున్నాయి. కేవలం బెంగళూరులోనే నిత్యం 296 టన్నుల ఫుడ్ వేస్ట్ అవుతుంది. అక్కడ ‘హెల్పింగ్ హీరోస్ ఇండియా’ అనే సంస్థ ఫుడ్ సేకరించి పేదలకిస్తోంది. ముంబైలో రాబిన్ హుడ్ ఆర్మీ&ముంబై డబ్బావాలా, కోల్‌కతా వీ కేర్, చెన్నై&హైదరాబాద్‌లో ‘NO FOOD WASTE’ సంస్థలు సేవలు అందిస్తున్నాయి.
News January 19, 2025
శ్రీవారికి రూ.6 కోట్ల విరాళం
AP: తిరుమల శ్రీవారికి చెన్నైకి చెందిన వర్ధమాన్ జైన్ అనే భక్తుడు ఒకేసారి రూ.6 కోట్ల మొత్తాన్ని విరాళంగా ఇచ్చారు. SVBC కోసం రూ.5 కోట్లు, గోసంరక్షణ ట్రస్టుకు రూ.కోటి విలువైన డీడీలను AEO వెంకయ్య చౌదరికి అందజేశారు. TTDకి చెందిన ట్రస్టులకు ఆయన గతంలోనూ భారీగా విరాళాలు ఇచ్చినట్లు సమాచారం.