News December 10, 2024

TODAY HEADLINES

image

* గత పాలకులు తెలంగాణ తల్లిని విస్మరించారు: రేవంత్
* ప్రభుత్వం పెట్టింది తెలంగాణ తల్లి కాదు, కాంగ్రెస్ తల్లి: KTR
* నాగబాబుకు మంత్రి పదవి.. నిర్ణయించిన CBN
* రాజ్యసభ సభ్యులుగా మస్తాన్‌రావు(TDP), సానా సతీశ్(TDP), ఆర్.కృష్ణయ్య(BJP) పేర్లు ఖరారు
* RBI కొత్త గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా
* TG గ్రూప్-2 పరీక్ష వాయిదాకు హైకోర్టు నిరాకరణ
* పోలీస్ స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్న మోహన్‌బాబు, మనోజ్

Similar News

News September 23, 2025

వారికీ తల్లికి వందనం నిధులు విడుదల చేస్తాం: మంత్రి లోకేశ్

image

AP: తల్లికి వందనం కింద 66,57,508 మంది విద్యార్థులకు రూ.15వేల చొప్పున సాయం అందించినట్లు మంత్రి లోకేశ్ మండలిలో తెలిపారు. ఇంకా అర్హులుంటే తప్పకుండా వర్తింపజేస్తామన్నారు. ఒకటో తరగతి విద్యార్థులకు అపార్ ఐడీ మంజూరు తర్వాత, ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో చేరినవారికి వెరిఫికేషన్ అనంతరం జమ చేస్తామని చెప్పారు. ఆశావర్కర్లు, అంగన్‌వాడీలకు కూడా పథకం వర్తింపు విషయాన్ని క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

News September 23, 2025

‘ఎల్లో వీన్ మొజాయిక్ వైరస్’తో బెండ పంటకు తీవ్ర నష్టం

image

బెండ పంటను ఆశించే చీడపీడల్లో ‘ఎల్లో వీన్ మొజాయిక్ వైరస్’ ప్రధానమైనది. ఈ వైరస్ ఉద్ధృతి పెరిగితే పంట పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. ఇది ప్రధానంగా తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. మొజాయిక్ వైరస్ సోకిన మొక్కల ఆకులపై పసుపుపచ్చని మచ్చలు లేదా చారలు ఏర్పడతాయి. ఆకుల ఆకారం మారుతుంది. కాండంపై మచ్చలు కనిపిస్తాయి. మొక్కల ఎదుగుదల, కాయల నాణ్యత తగ్గుతుంది. ఈ వైరస్ ఒక మెుక్క నుంచి ఇతర మొక్కలకు వ్యాపిస్తుంది.

News September 23, 2025

బెండలో మొజాయిక్ వైరస్‌ను ఎలా నివారించాలి?

image

బెండ తోటల్లో మొజాయిక్ వైరస్ వ్యాప్తికి తెల్లదోమ ప్రధాన కారణం. పంటలో ఈ దోమ ఉద్ధృతిని గుర్తించిన వెంటనే సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి. తెల్లదోమ నివారణకు లీటరు నీటిలో డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములను కలిపి వారం రోజుల వ్యవధితో రెండు సార్లు పిచికారీ చేయాలి. తోటలో కోతకు వచ్చిన బెండ కాయలను పురుగుమందుల పిచికారీకి ముందే కోసేయాలి. దీని వల్ల వాటిలో పురుగు మందుల అవశేషాలు లేకుండా ఉంటాయి.