News December 10, 2024
TODAY HEADLINES
* గత పాలకులు తెలంగాణ తల్లిని విస్మరించారు: రేవంత్
* ప్రభుత్వం పెట్టింది తెలంగాణ తల్లి కాదు, కాంగ్రెస్ తల్లి: KTR
* నాగబాబుకు మంత్రి పదవి.. నిర్ణయించిన CBN
* రాజ్యసభ సభ్యులుగా మస్తాన్‌రావు(TDP), సానా సతీశ్(TDP), ఆర్.కృష్ణయ్య(BJP) పేర్లు ఖరారు
* RBI కొత్త గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా
* TG గ్రూప్-2 పరీక్ష వాయిదాకు హైకోర్టు నిరాకరణ
* పోలీస్ స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్న మోహన్‌బాబు, మనోజ్
Similar News
News January 24, 2025
చిరంజీవితో అనిల్ రావిపూడి మరో బ్లాక్‌బస్టర్ తీస్తారు: నిర్మాత
విజయ పరంపర కొనసాగిస్తున్న అనిల్ రావిపూడి త్వరలోనే మెగాస్టార్ చిరంజీవితో సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది. ‘లైలా’ చిత్రం ఈవెంట్‌లో దీనిపై నిర్మాత సాహు గారపాటి ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. ‘చిరంజీవితో అనిల్ తీయబోయే సినిమా బ్లాక్ బస్టర్ ఖాయం. ఇది ఎమోషన్స్‌తో కూడిన కథ. ఈ మూవీ విజయంతో అనిల్ రావిపూడి కెరీర్‌లో ట్రిపుల్ హ్యాట్రిక్ ఖాయం’ అని తెలిపారు.
News January 24, 2025
USలోకి అక్రమంగా ప్రవేశిస్తే తీవ్ర పరిణామాలు: ట్రంప్
US నుంచి అక్రమ వలసదారులను పంపించేస్తున్నారు. మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్‌లో వారిని ఎక్కిస్తున్న ఫొటోలను వైట్ హౌస్ విడుదల చేసింది. ‘అక్రమ వలసదారులను తరలించే ఫ్లైట్స్ మొదలయ్యాయి. చట్టవిరుద్ధంగా USలోకి ప్రవేశిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇదే ప్రపంచానికి ప్రెసిడెంట్ ఇచ్చే స్పష్టమైన మెసేజ్’ అని పేర్కొంది. అక్రమ వలసలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల సమయంలో ట్రంప్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
News January 24, 2025
పెళ్లి చేసుకున్న ఇద్దరు మహిళలు.. ట్విస్ట్ ఏంటంటే?
UPలో కవిత, గుంజా అనే ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకున్నారు. భర్తలు పెట్టే చిత్రహింసలు తట్టుకోలేక వారి నుంచి విడిపోయి ఇలా ఒక్కటయ్యారు. గోరఖ్‌పూర్ జిల్లాకు చెందిన వీరిద్దరికి 4ఏళ్ల క్రితం ఇన్‌స్టాలో పరిచయమైంది. కొన్ని నెలలుగా ఒకే గదిలో ఉంటున్నారు. ఒకరిని వదిలి మరొకరు ఉండలేమని తెలుసుకుని తాజాగా ఓ ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. గుంజా తన పేరును బబ్లూగా మార్చుకుని తనకు భర్తగా ఉంటుందని కవిత తెలిపింది.