News December 10, 2024

రాజ్యసభకు అంటూ ప్రచారం.. అనుహ్యంగా మంత్రివర్గంలోకి

image

AP: రాష్ట్ర క్యాబినెట్‌లో చోటు కల్పిస్తున్నట్లు CM CBN ప్రకటించడంతో ఒక్కసారిగా నాగబాబు పేరు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఆయన జనసేన ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 2019లో లోక్‌సభకు ఎంపీగా పోటీ చేసి ఓడారు. గత ఎన్నికల్లోనూ పోటీ చేస్తారనే వార్తలు వచ్చినా సాధ్యపడలేదు. ఈ క్రమంలో రాజ్యసభ సీటు ఇస్తారని భావించినా బీజేపీ కృష్ణయ్య పేరును ప్రకటించింది. దీంతో ఆయనను మంత్రి వర్గంలోకి తీసుకున్నారని తెలుస్తోంది.

Similar News

News December 29, 2025

పిశాచ స్థానం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారా?

image

ఇంటి ప్రధాన గోడకు, ప్రహరీ గోడకు మధ్య ఉండే ఖాళీ స్థలాన్ని ‘పిశాచ స్థానం’ అంటారు. ఈ స్థలం విషయంలో వాస్తు నియమాలు పాటించకపోతే ప్రతికూల ప్రభావాలు ఉంటాయని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు హెచ్చరిస్తున్నారు. ‘ప్రకృతి వనరుల సమతుల్యత దెబ్బతినడం వల్ల ఆర్థిక ఇబ్బందులు, వృత్తిలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలుంటాయి. ఇంటి నిర్మాణంలో ఈ ఖాళీ స్థలాన్ని నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>

News December 29, 2025

ఇసుక సముద్రంలో ఒంటరిగా!

image

నైజర్ దేశంలోని సహారా ఎడారిలో 400KMS పరిధిలో ఒకే ఒక్క చెట్టు ఉండేది. ఎడారిలో ప్రయాణించేవారికి ఈ ‘టెనెరే వృక్షం’ ఓ దిక్సూచిలా ఉండేది. నీటికోసం భూగర్భంలోనికి తన వేళ్లను విస్తరించి ప్రాణాలు నిలుపుకుంది. ఈ చెట్టు స్థిరత్వానికి, పోరాట పటిమకు నిదర్శనంగా నిలిచింది. 1973లో ఓ ట్రక్కు డ్రైవర్ చెట్టును ఢీకొట్టడంతో 300 ఏళ్ల దాని ప్రస్థానం ముగిసింది. ప్రస్తుతం దీని అవశేషాలను నైజర్ జాతీయ మ్యూజియంలో భద్రపరిచారు.

News December 29, 2025

2025: అత్యధిక వసూళ్ల చిత్రంగా ‘ధురంధర్’

image

ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన భారతీయ చిత్రంగా రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ నిలిచింది. ఈ చిత్రం రూ.1034.8కోట్లు రాబట్టింది. IMDb ప్రకారం 2025లో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన టాప్-10 మూవీస్ ఇవే.. ధురంధర్, కాంతార-2 (₹853.4Cr), ఛావా(₹808.7Cr), సైయారా(₹575.8Cr), కూలీ (₹516.7Cr), వార్-2 (₹360.7Cr), మహావతార్ నరసింహ (₹326.1Cr), లోక చాప్టర్-1 (₹302.1Cr), OG (₹298.1Cr), హౌజ్‌ఫుల్-5 (₹292.5కోట్లు)