News December 10, 2024
రాజ్యసభకు అంటూ ప్రచారం.. అనుహ్యంగా మంత్రివర్గంలోకి
AP: రాష్ట్ర క్యాబినెట్‌లో చోటు కల్పిస్తున్నట్లు CM CBN ప్రకటించడంతో ఒక్కసారిగా నాగబాబు పేరు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఆయన జనసేన ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 2019లో లోక్‌సభకు ఎంపీగా పోటీ చేసి ఓడారు. గత ఎన్నికల్లోనూ పోటీ చేస్తారనే వార్తలు వచ్చినా సాధ్యపడలేదు. ఈ క్రమంలో రాజ్యసభ సీటు ఇస్తారని భావించినా బీజేపీ కృష్ణయ్య పేరును ప్రకటించింది. దీంతో ఆయనను మంత్రి వర్గంలోకి తీసుకున్నారని తెలుస్తోంది.
Similar News
News January 13, 2025
అప్పుడు జైలుకెళ్లిన వారికి రూ.20 వేల పెన్షన్
1975 నుంచి 1977 మధ్య దేశంలో ఎమర్జెన్సీ అమలులో ఉన్న సమయంలో జైలుకెళ్లిన వారికి నెలవారీ రూ.20,000 పెన్షన్ మంజూరు చేస్తామని ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది. పెన్షన్‌తో పాటు వారి వైద్య ఖర్చులనూ రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని, జనవరి 1, 2025 నాటికి జీవించి ఉన్న వారందరికీ ఈ సౌకర్యాలు కల్పిస్తామని తెలిపింది. జైలులో ఎన్ని రోజులు ఉన్నా సరే వారందరూ అర్హులే అని హోం శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.
News January 13, 2025
టెస్టు కెప్టెన్‌గా జైస్వాల్‌ను ప్రతిపాదించిన గంభీర్?
రోహిత్ తర్వాత టెస్టు కెప్టెన్ ఎవరనే దానిపై BCCI తీవ్ర కసరత్తు చేస్తోంది. నిన్న, ఈరోజు అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ, కోచ్ గంభీర్ సుదీర్ఘంగా చర్చలు జరిపారు. బుమ్రాకు కెప్టెన్సీ ఇస్తే వర్క్‌లోడ్ ఎక్కువవుతుందని భావించినట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే సెలక్షన్ కమిటీ తెరపైకి పంత్ పేరును తీసుకొచ్చిందని సమాచారం. అయితే గంభీర్ అనూహ్యంగా జైస్వాల్ పేరును ప్రతిపాదించారట. మరి దీనిపై BCCI ఏమంటుందో చూడాలి.
News January 13, 2025
ఉక్రెయిన్‌తో యుద్ధంలో కేరళ వాసి మృతి
ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యా తరఫున పోరాడుతున్న కేరళలోని త్రిసూర్ వాసి బినిల్(32) మృతి చెందారు. మరొకరు గాయపడ్డారు. కొన్ని రోజుల క్రితం వీరు డ్రోన్ దాడిలో గాయపడినట్టు ఫ్యామిలీకి సమాచారం వచ్చింది. బినిల్ భార్య మాస్కోలోని భారత ఎంబసీని సంప్రదించగా ఆయన మృతిని వారు మౌఖికంగా అంగీకరించారు. తిరిగి ఇంటికి చేరుకొనేందుకు బాధితులిద్దరూ గతంలో విఫలప్రయత్నాలు చేసినట్టు తెలుస్తోంది.