News December 10, 2024
రాత్రి 9 గంటల తర్వాత తింటున్నారా?

ప్రస్తుత బిజీ లైఫ్‌లో రాత్రి పూట కొందరు ఆలస్యంగా భోజనం చేస్తుంటారు. కానీ రాత్రి 9 గంటల నుంచి 12 గంటల మధ్యలో తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా రోజూ తింటే ఆరోగ్యం దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. బరువు పెరగడం, నిద్ర లేమి, బీపీ, షుగర్ వంటి జబ్బులు వచ్చే ఆస్కారం ఉంది. ఆలస్యంగా తినడం వల్ల కొవ్వు పెరిగి ఊబకాయం రావచ్చు. అందుకే సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య తినడం ఉత్తమం.
Similar News
News December 28, 2025
నుమాయిష్ ఎగ్జిబిషన్ ఎప్పటినుంచంటే?

TG: 85వ ఆలిండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్(నుమాయిష్) 2026 వివరాలను మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. జనవరి 1న ప్రారంభమై FEB 15 వరకు కొనసాగనుందని చెప్పారు. ఇన్నోవేషన్, ట్రెడిషన్‌తోపాటు సరసమైన ధరలకే అన్నీ వస్తువులు దొరుకుతాయన్నారు. ఈసారి సేఫ్టీ, యాక్సెసబిలిటీ, మహిళా వ్యాపారస్థుల కోసం ప్రత్యేక అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. నుమాయిష్ తప్పక సందర్శించాల్సిన సంప్రదాయంగా మారిపోయిందని ట్వీట్ చేశారు.
News December 28, 2025
కర్ణాటక రాజకీయాల్లో KC చిచ్చు.. BJP ఫైర్

బెంగళూరులో అక్రమ కట్టడాల కూల్చివేత కర్ణాటకలో రాజకీయ దుమారం రేపింది. ఈ వ్యవహారంలో కాంగ్రెస్ నేత KC వేణుగోపాల్ జోక్యం చేసుకోవడంపై BJP మండిపడింది. ఆయన్ను ‘సూపర్ CM’గా అభివర్ణిస్తూ కర్ణాటక ప్రభుత్వం ఢిల్లీ ఆదేశాలతో నడుస్తోందని విమర్శించింది. రాష్ట్ర పాలనలో జోక్యం చేసుకోవడం సమాఖ్య వ్యవస్థను అవమానించడమేనని ప్రతిపక్ష నేత అశోక ధ్వజమెత్తారు.
News December 28, 2025
Op సిందూర్ టైమ్‌లో బంకర్‌లోకి వెళ్లమన్నారు: పాక్ అధ్యక్షుడు

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’తో పాక్ అగ్రనాయకత్వం భయాందోళనకు గురైందని అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ అంగీకరించారు. ఆ సమయంలో ప్రాణరక్షణ కోసం బంకర్‌లోకి వెళ్లాలని సైనిక కార్యదర్శి తనకు సూచించారని వెల్లడించారు. అందుకు తాను నిరాకరించినట్లు తెలిపారు. కాగా భారత క్షిపణుల ధాటికి పాక్ బెంబేలెత్తిపోయిందనే విషయం దీని ద్వారా స్పష్టమైంది.


