News December 10, 2024
రాత్రి 9 గంటల తర్వాత తింటున్నారా?
ప్రస్తుత బిజీ లైఫ్‌లో రాత్రి పూట కొందరు ఆలస్యంగా భోజనం చేస్తుంటారు. కానీ రాత్రి 9 గంటల నుంచి 12 గంటల మధ్యలో తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా రోజూ తింటే ఆరోగ్యం దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. బరువు పెరగడం, నిద్ర లేమి, బీపీ, షుగర్ వంటి జబ్బులు వచ్చే ఆస్కారం ఉంది. ఆలస్యంగా తినడం వల్ల కొవ్వు పెరిగి ఊబకాయం రావచ్చు. అందుకే సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య తినడం ఉత్తమం.
Similar News
News January 17, 2025
పోలవరం ఆలస్యానికి జగనే కారణం: మంత్రి నిమ్మల
AP: గోదావరి, కృష్ణా జలాలపై మాట్లాడే అర్హత మాజీ సీఎం జగన్‌కు లేదని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. తన కేసులు, బెయిల్ కోసం జలాలపై హక్కులను ఆయన వదులుకున్నారని ఆరోపించారు. అలాంటి వ్యక్తిని రైతులు క్షమించబోరని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు ఆలస్యానికి కూడా జగనే కారణమని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు రెండు ఫేజ్‌లలో 51.15 మీటర్లు, 45.72 మీటర్లు అంటూ ద్రోహం చేశారని మండిపడ్డారు.
News January 17, 2025
రాత్రి భోజనం చేయకపోతే…
బరువు తగ్గుతామని చాలామంది అనుకుంటారు. కానీ అది తప్పు. నైట్ భోజనం చేయకపోతే మధ్యరాత్రి ఆకలివేసి నిద్రకు భంగం కలుగుతుంది. ఎసిడిటీ, కడుపు నొప్పి సమస్యలు వస్తాయి. మరుసటి రోజంతా నీరసంగా ఉంటుంది. బద్దకం, చికాకు పెరుగుతుంది. ఉదయం లేవగానే బాగా ఆకలేసి ఎక్కువ తింటారు. ఇది బరువు పెరుగుదలకు కారణం అవుతుంది. అందుకే ప్రతిరోజూ రాత్రి తప్పకుండా భోజనం చేయాలి. అయితే రోస్టెడ్‌తో పాటు ఫాస్ట్‌ఫుడ్ వంటివి తినకూడదు.
News January 17, 2025
పదిహేనేళ్లలో రూ.5400 నుంచి రూ.4లక్షలు
డిగ్రీలున్నా ఉద్యోగాలు రాక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. మరికొందరు తక్కువ శాలరీ అని వచ్చినదాన్ని వద్దనుకుంటారు. అలా కష్టపడినవారికి ఎక్స్‌పీరియన్స్ తోడైతే విజయాన్ని ఎంజాయ్ చేయొచ్చనే విషయాన్ని గుర్తించరు. అలాంటి వారికి కళ్లు తెరిపించే ఓ ఉదాహరణ నెట్టింట వైరలవుతోంది. ప్రదీప్ కుమార్ అనే వ్యక్తి 2008లో నెలకు రూ.5400 జీతం వచ్చే ఉద్యోగాన్ని నిలబెట్టుకొని ఇప్పుడు ఏడాదికి రూ.50లక్షలు సంపాదిస్తున్నారు.