News December 10, 2024
జైళ్ల శాఖలో ఖాళీల వివరాలివ్వండి.. రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశం

జైళ్ల శాఖలో ఉన్న పోస్టులు, ఖాళీలు-వాటి భర్తీ చర్యల వివరాలు సమర్పించాలని అన్ని రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. కారాగారాలు నిండిపోతుండడంపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ హృషికేశ్ రాయ్ బెంచ్ ఈ ఆదేశాలిచ్చింది. జైళ్లు నిండిపోయి కారాగారాల్లో సిబ్బంది తక్కువగా ఉన్నప్పుడు ఖైదీలు, విచారణ ఖైదీల సమస్యలు పెరిగే అవకాశముందని పేర్కొంది. వివరాలు సమర్పించేందుకు 8 వారాల గడువిచ్చింది.
Similar News
News September 22, 2025
ఇవాళ విశాఖకు సీఎం చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు ఇవాళ వైజాగ్‌లో పర్యటించనున్నారు. 2 రోజుల పాటు జరిగే జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సును ఆయన ప్రారంభిస్తారు. ఈ ఏడాది ‘సివిల్ సర్వీస్ అండ్ డిజిటల్ ట్రాన్స్ ఫార్మేషన్’ థీమ్‌తో ఈ కాంక్లేవ్‌ను నిర్వహిస్తున్నారు. AI, సైబర్ సెక్యూరిటీ, పౌర సేవలు, అగ్రి-స్టాక్ వంటి అంశాలపై చర్చించనున్నారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్ ఈ సదస్సుకు హాజరుకానున్నారు.
News September 22, 2025
పవన్ అభిమానులకు ఇంకా నిరీక్షణే..

పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందిన ‘OG’ ఈ నెల 25న థియేటర్లలో రిలీజ్ కానుంది. నిన్ననే ట్రైలర్ రావాల్సి ఉండగా పలు కారణాలతో రిలీజ్ కాలేదు. అయితే సినిమా విడుదలకు దగ్గర పడుతున్నా ట్రైలర్ రాకపోవడం ఏంటని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఇవాళ ట్రైలర్ ఛాన్స్ ఉండటంతో రెండు రోజులు ముందు విడుదల చేస్తే ఎలా అని అంటున్నారు. ఇలాంటివి సరిగ్గా ప్లాన్ చేసుకోవాలని దర్శకనిర్మాతలకు సూచిస్తున్నారు.
News September 22, 2025
బీసీ కోటాను ఖరారు చేయాలని అధికారులకు CS ఆదేశాలు!

TG: స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు జరుగుతున్నాయి. 42% బీసీ రిజర్వేషన్ల కోటాను 4-5 రోజుల్లో ఖరారు చేయాలని పంచాయతీ రాజ్ అధికారులను CS రామకృష్ణారావు ఆదేశించినట్లు తెలుస్తోంది. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ తర్వాత పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. BC బిల్లులు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉండగా ప్రభుత్వం జీవోతో కోటాను అమలు చేస్తుందా అనేది ప్రశ్నగా మారింది.