News December 10, 2024

జైళ్ల‌ శాఖలో ఖాళీల‌ వివ‌రాలివ్వండి.. రాష్ట్రాల‌కు సుప్రీంకోర్టు ఆదేశం

image

జైళ్ల శాఖ‌లో ఉన్న పోస్టులు, ఖాళీలు-వాటి భర్తీ చర్యల వివ‌రాలు స‌మ‌ర్పించాల‌ని అన్ని రాష్ట్రాల‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. కారాగారాలు నిండిపోతుండ‌డంపై దాఖ‌లైన పిటిష‌న్ విచార‌ణ సంద‌ర్భంగా జస్టిస్ హృషికేశ్ రాయ్‌ బెంచ్ ఈ ఆదేశాలిచ్చింది. జైళ్లు నిండిపోయి కారాగారాల్లో సిబ్బంది తక్కువగా ఉన్నప్పుడు ఖైదీలు, విచారణ ఖైదీల సమస్యలు పెరిగే అవకాశముందని పేర్కొంది. వివ‌రాలు స‌మ‌ర్పించేందుకు 8 వారాల గడువిచ్చింది.

Similar News

News January 26, 2025

పద్మ అవార్డులు పొందిన తెలుగు నటులు వీరే

image

టాలీవుడ్ నటులకు చాలా తక్కువగా పద్మ అవార్డులు వచ్చాయి. ఇప్పటివరకు ఐదు మందినే పద్మ పురస్కారాలు వరించాయి. ఎన్టీఆర్ పద్మశ్రీ-1968, అక్కినేని నాగేశ్వరరావు పద్మశ్రీ-1968, పద్మ భూషణ్-1988, పద్మ విభూషణ్-2011, క్రిష్ణ పద్మభూషణ్-2009, చిరంజీవి పద్మభూషణ్-2006, పద్మ విభూషణ్-2024, నందమూరి బాలకృష్ణ-2025.

News January 26, 2025

కుంభమేళా.. నాగసాధువుల గురించి ఈ విషయాలు తెలుసా?

image

ప్రయాగ్‌రాజ్ కుంభమేళాకు వేలసంఖ్యలో నాగసాధువులు తరలివచ్చి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. నాగసాధువులు ఒంటి మీద నూలుపోగు లేకుండా హిమాలయాల్లో ధ్యానం చేస్తుంటారు. విపరీతమైన చలి, ఎండకు కూడా వీరు చలించరు. అన్ని రుతువులకు తట్టుకునేలా అగ్నిసాధన, నాడీ శోధన, మంత్రపఠనం చేసి శరీరం, మనసుపై నియంత్రణ పొందుతారు. రోజులో ఒక్కసారి మాత్రమే భోజనం తీసుకుంటారు. వీరు చనిపోయిన చోటే సమాధి చేస్తారు.

News January 26, 2025

మహ్మద్ షమీకి మళ్లీ మొండిచేయే..!

image

ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమ్ ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీకి తుది జట్టులో చోటు దక్కలేదు. తొలి టీ20లో స్థానం దక్కకపోయినా రెండో మ్యాచులోనైనా ఆయనను ఆడిస్తారని అంతా భావించారు. కానీ మేనేజ్‌మెంట్ అతడిని పెవిలియన్‌కే పరిమితం చేసింది. దీంతో చాన్నాళ్లకు షమీ బౌలింగ్ చూద్దామనుకున్న అభిమానులకు మరోసారి అసంతృప్తే మిగిలింది. మూడో టీ20లోనైనా ఆయనకు ఛాన్స్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.