News December 12, 2024
ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు కొత్త యూనిఫాం?
AP: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందించనున్న సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది నుంచి స్టూడెంట్స్‌కు కొత్త యూనిఫామ్ అందుబాటులోకి తేనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న యూనిఫామ్, బెల్టులు, బ్యాగ్‌ల రంగులను మారుస్తోంది. కొత్త యూనిఫామ్ నమూనా సోషల్ మీడియాలో వైరలవుతోంది.
Similar News
News December 27, 2024
మన్మోహన్ లెగసీని కొనసాగిస్తాం: CWC
దేశంలో సంస్కరణలకు పునాది వేసి రాజకీయ, ఆర్థిక రంగాల్లో మన్మోహన్ సింగ్ గణనీయమైన ప్రభావాన్ని చూపారని CWC కొనియాడింది. మాజీ ప్రధాని గౌరవార్థం సమావేశమైన CWC ఆయన నాయకత్వమే క్లిష్ట పరిస్థితుల్లో దేశాన్ని ముందుకు నడిపిందని కీర్తించింది. ఆయన లెగసీని కొనసాగిస్తామని తీర్మానించింది. శనివారం ఉదయం ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి మన్మోహన్ భౌతికకాయాన్ని తరలించనున్నారు.
News December 27, 2024
నోట్ల రద్దుపై మన్మోహన్ ఏమన్నారంటే..
నోట్ల రద్దును మాన్యుమెంటల్ డిజాస్టర్‌గా మన్మోహన్ అభివర్ణించారు. నల్లధనాన్ని వెలికితీయడానికే నోట్ల రద్దు చేశామని చెప్పిన మోదీ, మొత్తం కరెన్సీ నల్లధనమని- మొత్తం నల్లధనం కరెన్సీ రూపంలో ఉందనే తప్పుడు ఊహ నుంచి ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. ఈ చర్య ఆర్థిక వ్యవస్థను ఛిద్రం చేస్తుందని అనాడు మన్మోహన్ చెప్పినట్టే రూపాయి విలువ ఈ రోజు జీవిత కాల కనిష్టానికి చేరుకుందని నిపుణులంటున్నారు.
News December 27, 2024
UPI పేమెంట్లు చేసే వారికి శుభవార్త
UPI చెల్లింపులపై RBI శుభవార్త చెప్పింది. ఇకపై థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్(PPI) వ్యాలెట్లలోని సొమ్ముతో చెల్లింపులు చేసే అవకాశం కల్పించింది. ఇప్పటివరకు PPI సంస్థకు చెందిన UPI ద్వారానే ఈ తరహా పేమెంట్లకు అవకాశం ఉంది. తాజా నిర్ణయంతో ఫోన్‌పే, పేటీఎం సహా పలు వ్యాలెట్లలోని మొత్తాన్ని ఇతర యాప్‌ల్లోనూ వాడుకోవచ్చు. దీంతో గిఫ్ట్, డిజిటల్ వ్యాలెట్లు వాడే వారికి ఈజీ అవుతుంది.