News December 12, 2024
ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు కొత్త యూనిఫాం?
AP: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందించనున్న సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది నుంచి స్టూడెంట్స్‌కు కొత్త యూనిఫామ్ అందుబాటులోకి తేనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న యూనిఫామ్, బెల్టులు, బ్యాగ్‌ల రంగులను మారుస్తోంది. కొత్త యూనిఫామ్ నమూనా సోషల్ మీడియాలో వైరలవుతోంది.
Similar News
News January 16, 2025
నితీశ్‌కు లోకేశ్ అభినందనలు
AP: రాష్ట్రంలోని యువ క్రీడాకారులకు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి స్ఫూర్తిగా నిలిచారని మంత్రి లోకేశ్ కొనియాడారు. భారత జట్టుకు మరింతగా సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఇటీవల ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌లో సత్తా చాటిన నితీశ్ మంత్రిని తాజాగా కలిసారు. ఈ సందర్భంగా మంగళగిరి చేనేత శాలువాతో సన్మానించిన లోకేశ్, జ్ఞాపికను అందించారు.
News January 16, 2025
ఫిబ్రవరి 14 నుంచి WPL ప్రారంభం
వచ్చే నెల 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ప్రారంభం కానున్నట్లు BCCI ప్రకటించింది. బరోడా వేదికగా బెంగళూరు-గుజరాత్ మధ్య తొలి మ్యాచ్‌తో సమరానికి తెర లేవనుంది. మొత్తం 5 జట్లు పాల్గొనే ఈ మెగా ఈవెంట్‌లో 22 మ్యాచ్‌లు జరుగుతాయి. బరోడాతో పాటు బెంగళూరు, లక్నో, ముంబైని వేదికలుగా ఖరారు చేశారు. మార్చి 15న ముంబైలో ఫైనల్ జరగనుంది. పూర్తి షెడ్యూల్‌ను పైన ఫొటోల్లో చూడొచ్చు.
News January 16, 2025
తల్లి కాదు రాక్షసి.. ఫాలోవర్లు, డబ్బు కోసం కూతురిని..
సోషల్ మీడియాలో ఫాలోవర్లు, డబ్బుల కోసం ఆస్ట్రేలియాలో ఓ మహిళ (34) దారుణానికి పాల్పడింది. ఏడాది వయసున్న కూతురికి అనవసర ఔషధాలను ఇచ్చి అనారోగ్యానికి గురయ్యేలా చేసింది. చిన్నారి పడే బాధను ఫొటోలు, వీడియోల రూపంలో టిక్‌టాక్‌లో పోస్టు చేసి విరాళంగా $37,300ను పొందింది. బాలిక ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రిలో చేర్చగా అసలు విషయం బయటపడింది. పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. చిన్నారికి మెరుగైన వైద్యం అందిస్తున్నారు.