News December 12, 2024
ఈ నెల 19 నుంచి హైదరాబాద్ బుక్ ఫెయిర్
TG: ఈ నెల 19 నుంచి 29 వరకు హైదరాబాద్ బుక్ ఫెయిర్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే పుస్తక ప్రదర్శనలో 350 స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. బుక్ ఫెయిర్‌లో తెలంగాణ వంటకాలతోపాటు ఇరానీ చాయ్, బిర్యానీ కూడా అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఈ ప్రదర్శనను సీఎం రేవంత్‌తోపాటు మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభిస్తారని తెలిపారు.
Similar News
News December 12, 2024
T20 ఫార్మాట్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ?
ఛాంపియన్స్ ట్రోఫీ 2025ను టీ20 ఫార్మాట్‌లో నిర్వహించాలని బ్రాడ్‌కాస్టర్లు ఐసీసీకి ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఇప్పటికీ షెడ్యూల్ ఖరారు కాకపోవడంతో మార్కెటింగ్ చేసుకోలేకపోతున్నామని వారు తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. వన్డే ఫార్మాట్‌లో కాకుండా టీ20 ఫార్మాట్‌లో అయితే నష్టం వాటిల్లకుండా ఉంటుందని చెప్పినట్లు సమాచారం. దీనిపై ఐసీసీ కూడా పునరాలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
News December 12, 2024
బ్రిస్బేన్ హోటల్‌లో కోహ్లీ-అనుష్క!
విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ జంట తమ ఏడో వివాహ వార్షికోత్సవాన్ని ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ హోటల్‌లో జరుపుకుంది. దీనికి సంబంధించిన ఫొటో వైరలవుతోంది. ప్రస్తుతం కోహ్లీ BGT కోసం జట్టుతో కలిసి ఆస్ట్రేలియాకు చేరుకోగా మూడో టెస్టు కోసం సన్నద్ధం అవుతున్నారు. వెడ్డింగ్ డే కావడంతో టీమ్‌కు దూరంగా ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేశారు. 2017 డిసెంబర్ 11న వీరిద్దరి ప్రేమ వివాహం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే.
News December 12, 2024
భార్యాబాధితుడి సూసైడ్: చచ్చిపోవాలని భార్య తిడితే నవ్విన జడ్జి!
మనోవర్తి చెల్లించలేక, భార్య క్రూరత్వాన్ని భరించలేక సూసైడ్ చేసుకున్న అతుల్ సుభాష్ కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ‘పిల్లాడి బాగోగుల కోసం మొదట నెలకు రూ.40వేలు అడిగారు. తర్వాత రూ.80వేలు, లక్షకు పెంచారు. చిన్న పిల్లాడికి ఎంత ఖర్చవుతుందని అతుల్ ప్రశ్నించారు. డబ్బు చెల్లించకుంటే సూసైడ్ చేసుకోవాలని భార్య అతడి మొహంపైనే అనేయడంతో జడ్జి నవ్వారు. ఇదెంతో బాధించింది’ అని అతుల్ అంకుల్ పవన్ ఆరోపించారు.