News December 12, 2024

ఈ నెల 19 నుంచి హైదరాబాద్ బుక్ ఫెయిర్

image

TG: ఈ నెల 19 నుంచి 29 వరకు హైదరాబాద్ బుక్ ఫెయిర్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే పుస్తక ప్రదర్శనలో 350 స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. బుక్ ఫెయిర్‌లో తెలంగాణ వంటకాలతోపాటు ఇరానీ చాయ్, బిర్యానీ కూడా అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఈ ప్రదర్శనను సీఎం రేవంత్‌తోపాటు మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభిస్తారని తెలిపారు.

Similar News

News January 21, 2025

గ్రూప్-1 మెయిన్స్: ఈ నగరాల్లోనే సెంటర్లు

image

AP: గ్రూప్-1 మెయిన్స్‌కు ఏపీపీఎస్సీ 1:50 చొప్పున అభ్యర్థులను ఎంపిక చేసింది. దీని ప్రకారం 4,496 మంది <<15215857>>మెయిన్స్ రాసేందుకు<<>> అర్హత సాధించారు. 2023 DECలో 89 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. గతేడాది మార్చి 17న ప్రిలిమ్స్ జరిగింది. మెయిన్స్ కోసం విశాఖ, విజయవాడ, తిరుపతి, అనంతపురంలో సెంటర్లు ఏర్పాటు చేశారు.

News January 21, 2025

ఎంత పని చేశావ్ ట్రంప్ మావా!

image

USAలో అక్రమంగా ఉంటున్న వారిపైనే ట్రంప్ చర్యలు తీసుకుంటారని అంతా భావించారు. కానీ వచ్చీ రాగానే లీగల్ ఇమ్మిగ్రెంట్స్‌కూ షాక్ ఇచ్చారు. USAలో పుట్టే పిల్లల పేరంట్స్‌లో ఒకరికి గ్రీన్ కార్డు/US పౌరసత్వం ఉంటేనే జన్మత: పౌరసత్వం కల్పించేలా నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఎవరైనా USAలో పుట్టగానే అక్కడి పౌరులయ్యేవారు. వారి పేరంట్స్ విదేశీయులైతే, కాస్త ఆలస్యమైనా ఆ కపుల్‌కు గ్రీన్ కార్డు వచ్చేది. ఇప్పుడిది కష్టమే.

News January 21, 2025

అందుకు బాధగా లేదు: సూర్యకుమార్ యాదవ్

image

ఛాంపియన్స్ ట్రోపీ 2025కు తనను సెలక్ట్ చేయకపోవడంపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించారు. ‘ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక కానందుకు నాకేం బాధలేదు. నేను గతంలో బాగా ఆడుంటే సెలక్టర్లు కచ్చితంగా సెలక్ట్ చేసేవారు. నాకంటే మెరుగైన ప్రదర్శన చేసిన వారినే జట్టులోకి తీసుకున్నారు. వారి కంటే బాగా రాణించనందుకు బాధపడుతున్నా. CTలో బుమ్రా-షమీ కీలక పాత్ర పోషిస్తారు’ అని ఆయన వ్యాఖ్యానించారు.