News December 12, 2024
బతుకమ్మ మన పండుగే కాదన్న ప్రచారం మొదలైంది: బండి సంజయ్
తెలంగాణ సంస్కృతిపై దాడి జరుగుతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ దుయ్యబట్టారు. తెలంగాణ తల్లి విగ్రహం చేతిలో బతుకమ్మ మాయమైందని, బతుకమ్మ మన పండుగే కాదన్న ప్రచారం మొదలైందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘బాసరలో లడ్డూలు అందట్లేదు. కొమురవెల్లి ప్రసాదంలో నాణ్యత లేదు. పండుగలపై ఆంక్షలు పెరుగుతున్నాయి’ అని Xలో విమర్శించారు. కాంగ్రెస్ చూసీ చూడనట్లు వదిలేస్తోందా? లేక ప్రభుత్వమే ఈ దాడిని చేయిస్తోందా? అని ప్రశ్నించారు.
Similar News
News December 12, 2024
కిషన్ రెడ్డితో రేవంత్ రెడ్డి భేటీ
TG: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. కాసేపటి క్రితం కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డితో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఇవాళ రాత్రి కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, నితిన్ గడ్కరీని కూడా సీఎం కలవనున్నారు.
News December 12, 2024
రాజ్యాన్ని కాపాడే సైనిక చీమలు
ప్రతి రాజ్యానికి సైనికులున్నట్లే ప్రత్యర్థుల నుంచి పుట్టలను కాపాడేందుకు ప్రత్యేకమైన చీమలు ఉంటాయి. వీటిని తాబేలు చీమలు లేదా సైనిక చీమలు అని పిలుస్తుంటారు. వీటి ప్రత్యేకమైన తలలే వీటి ఆయుధాలు. రాజ్యంలోకి ఇతర కీటకాలు రాకుండా గూళ్ల ప్రవేశాన్ని మూసేసి వాటిని అడ్డుకుంటాయి. తలను గూడు వద్ద తలుపులా ఫిక్స్ చేస్తాయి. ఏవైనా చీమలు బయటకు వెళ్లాలంటే అవి పక్కకు జరుగుతాయి. ఇవి చొరబాటుదారులను లోపలికి రానివ్వవు.
News December 12, 2024
ఈ ఏడాది మోస్ట్ పాపులర్ సినిమా ఇదే!
అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ చలనచిత్రాల జాబితాను IMDb ప్రకటించింది. జనవరి 1 నుంచి నవంబర్ 25వ తేదీ మధ్య విడుదలైన అన్ని చిత్రాల్లో రేటింగ్స్ బట్టి టాప్-10 జాబితాను రిలీజ్ చేసింది. ఇందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి’ సినిమా టాప్-1లో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో ‘స్త్రీ-2’, మహారాజా, సైతాన్, ఫైటర్, మంజుమ్మల్ బాయ్స్, భూల్ భులయ్యా-3, కిల్, సింగమ్ అగైన్, లాపతా లేడీస్ ఉన్నాయి.