News December 12, 2024

బతుకమ్మ మన పండుగే కాదన్న ప్రచారం మొదలైంది: బండి సంజయ్

image

తెలంగాణ సంస్కృతిపై దాడి జరుగుతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ దుయ్యబట్టారు. తెలంగాణ తల్లి విగ్రహం చేతిలో బతుకమ్మ మాయమైందని, బతుకమ్మ మన పండుగే కాదన్న ప్రచారం మొదలైందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘బాసరలో లడ్డూలు అందట్లేదు. కొమురవెల్లి ప్రసాదంలో నాణ్యత లేదు. పండుగలపై ఆంక్షలు పెరుగుతున్నాయి’ అని Xలో విమర్శించారు. కాంగ్రెస్ చూసీ చూడనట్లు వదిలేస్తోందా? లేక ప్రభుత్వమే ఈ దాడిని చేయిస్తోందా? అని ప్రశ్నించారు.

Similar News

News January 24, 2025

Richest TV Star.. ఆస్తి రూ.5200 కోట్లు

image

ఆయన నటించరు. కనీసం పాడరు. డాన్సూ చేయరు. అయినా దశాబ్దకాలంగా హయ్యెస్ట్ పెయిడ్ టీవీ స్టార్‌గా గుర్తింపు పొందారు. ఏడాదికి రూ.650CR సంపాదిస్తారు. ఇప్పుడాయన నెట్‌వర్త్ ఏకంగా రూ.5200 కోట్లు. ఆయనే మ్యూజిక్ ఎగ్జిక్యూటివ్, ప్రొడ్యూసర్, రియాల్టి షోస్ జడ్జి సైమన్ కోవెల్. The X Factor, Britain’s Got Talent, American Idol, America’s Got Talentకు జడ్జి. వీటితో పాటు Syco కంపెనీ ద్వారా ఆయనకు ఆదాయం వస్తుంది.

News January 24, 2025

విజయసాయి రెడ్డి.. ఇది ధర్మమా?: బండ్ల గణేశ్

image

రాజకీయాల నుంచి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తప్పుకోవడంపై సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ స్పందించారు. ‘అధికారం ఉన్నప్పుడు అనుభవించి కష్టాల్లో ఉన్నప్పుడు వదిలి వెళ్లిపోవడం చాలా మంది రాజకీయ నాయకులకు ఫ్యాషన్ అయిపోయింది. ఇది ధర్మమా!’ అని ట్వీట్ చేశారు.

News January 24, 2025

కౌశిక్ రెడ్డికి మంత్రి ఉత్తమ్ వార్నింగ్

image

TG: తీరు మార్చుకోకపోతే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు ఉండదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. యువ రాజకీయ నాయకుడికి అంత ఆవేశం పనికిరాదని మంత్రి హితవు పలికారు. తమ ఇద్దరికి ఎలాంటి రాజకీయ సంబంధాలు లేవని, ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని ఉత్తమ్ సూచించారు.