News December 12, 2024
‘పుష్ప-2’లో నా ఫేవరెట్ సీన్ అదే: అల్లు అర్జున్
‘పుష్ప-2’ సినిమాలో ‘తగ్గేదేలే’ అని చెప్పే ప్రతి సీన్ తన ఫేవరెటేనని హీరో అల్లు అర్జున్ చెప్పారు. ఈ సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన భారతీయులకు ఐకాన్ స్టార్ ధన్యవాదాలు తెలిపారు. పుష్ప అంటే ఫైర్ కాదని, వెల్డ్ ఫైర్ అని హిందీలో డైలాగ్ చెప్పారు. ఢిల్లీలో నిర్వహించిన ‘థాంక్యూ ఇండియా’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సక్సెస్ క్రెడిట్ అంతా దర్శకుడు సుకుమార్‌దేనని పేర్కొన్నారు.
Similar News
News December 12, 2024
అర్ధ సంవత్సర పాలన అర్థ రహితం: షర్మిల
AP: కూటమి ప్రభుత్వం అర్ధ సంవత్సర పాలన అర్థ రహితమని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల దుయ్యబట్టారు. ఆరు నెలల పాలనలో సూపర్ 6 హామీల అమలుకు దిక్కులేదని విమర్శించారు. టీడీపీ తొలి ఐదేళ్ల పాలనలో అరచేతిలో వైకుంఠం చూపిస్తే, ఇప్పుడు అదే చేతిలో కైలాసం చూపిస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వానికి హనీమూన్ ముగిసిందని, ఇప్పటికైనా ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
News December 12, 2024
కానిస్టేబుల్ అభ్యర్థులకు BIG ALERT
APలో కానిస్టేబుల్ అభ్యర్థులకు స్టేజ్-2 PMT/PET పరీక్షలపై పోలీస్ నియామక మండలి కీలక ప్రకటన చేసింది. ఈ నెల 30వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఉమ్మడి 13 జిల్లా కేంద్రాల్లో ఫిజికల్ టెస్టులు నిర్వహిస్తామని తెలిపింది. ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి అభ్యర్థులు కాల్ లెటర్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని వెల్లడించింది. సందేహాలుంటే 9441450639, 9100203323 నంబర్లను సంప్రదించండి.
News December 12, 2024
రికార్డులన్నాక బ్రేక్ అవ్వాల్సిందే: అల్లు అర్జున్
రికార్డులనేవి తాత్కాలికమేనని, వాటికన్నా తనకు అభిమానుల ప్రేమే ముఖ్యమని హీరో అల్లు అర్జున్ అన్నారు. రికార్డులన్నాక బ్రేక్ అవ్వాల్సిందేనని తాను చెప్తానని, ఇంకో 2-3 నెలల్లో కొత్తవి నమోదు కావచ్చని చెప్పారు. సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ అనేది ముఖ్యం కాదని దేశం ఎదుగుతోందని పేర్కొన్నారు. ‘పుష్ప-2’ విడుదలైన ఆరు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1,000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి చరిత్ర సృష్టించింది.