News December 12, 2024
‘పుష్ప-2’లో నా ఫేవరెట్ సీన్ అదే: అల్లు అర్జున్
‘పుష్ప-2’ సినిమాలో ‘తగ్గేదేలే’ అని చెప్పే ప్రతి సీన్ తన ఫేవరెటేనని హీరో అల్లు అర్జున్ చెప్పారు. ఈ సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన భారతీయులకు ఐకాన్ స్టార్ ధన్యవాదాలు తెలిపారు. పుష్ప అంటే ఫైర్ కాదని, వెల్డ్ ఫైర్ అని హిందీలో డైలాగ్ చెప్పారు. ఢిల్లీలో నిర్వహించిన ‘థాంక్యూ ఇండియా’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సక్సెస్ క్రెడిట్ అంతా దర్శకుడు సుకుమార్‌దేనని పేర్కొన్నారు.
Similar News
News January 13, 2025
ఈరోజు నమాజ్ వేళలు
✒ తేది: జనవరి 13, సోమవారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5.33 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.49 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.25 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.25 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.01 గంటలకు
✒ ఇష: రాత్రి 7.17 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News January 13, 2025
భోగి మంటల వెనుక శాస్త్రీయ కోణం!
భోగీ నాడు ఊరువాడ భోగి మంటలు వేయడం అనవాయితీగా ఉన్నా దీనికి శాస్త్రీయ కోణం ఉంది. ఈ మంటలు వేయడం వల్ల పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా సామాజిక బంధాలు బలపడతాయి. అందరూ ఒక చోట చేరడంతో ఐక్యత పెరుగుతుంది. చలి కాలంలో ఉష్ణోగ్రతను పెంచుతాయి. ఇంట్లోని చెత్తను నిర్మూలించడమే కాకుండా ఈ బూడిద నుంచి పోటాషియం వంటి ఖనిజాలు మట్టికి అందుతాయి. ఈ మంటల్లో పిడకలను కాల్చడం వల్ల గాలి శుద్ది అవుతుంది.
News January 13, 2025
శుభ ముహూర్తం (13-01-2025)
✒ తిథి: శుక్ల చతుర్దశి ఉ.4.55 వరకు
✒ నక్షత్రం: ఆరుద్ర ఉ.11.00 వరకు
✒ శుభ సమయం: ఆరుద్ర శివ పూజలకు మంచిది
✒ రాహుకాలం: ఉ.7.30-9.00 గంటల వరకు
✒ యమగండం: ఉ.10.30-12.00 వరకు
✒ దుర్ముహూర్తం: 1.మ.12.24-1.12 వరకు
2.మ.2.46-3.34 వరకు
✒ వర్జ్యం: రా.10.50-12.30 వరకు
✒ అమృత ఘడియలు: లేవు