News December 12, 2024

రాజ్యాన్ని కాపాడే సైనిక చీమలు

image

ప్రతి రాజ్యానికి సైనికులున్నట్లే ప్రత్యర్థుల నుంచి పుట్టలను కాపాడేందుకు ప్రత్యేకమైన చీమలు ఉంటాయి. వీటిని తాబేలు చీమలు లేదా సైనిక చీమలు అని పిలుస్తుంటారు. వీటి ప్రత్యేకమైన తలలే వీటి ఆయుధాలు. రాజ్యంలోకి ఇతర కీటకాలు రాకుండా గూళ్ల ప్రవేశాన్ని మూసేసి వాటిని అడ్డుకుంటాయి. తలను గూడు వద్ద తలుపులా ఫిక్స్ చేస్తాయి. ఏవైనా చీమలు బయటకు వెళ్లాలంటే అవి పక్కకు జరుగుతాయి. ఇవి చొరబాటుదారులను లోపలికి రానివ్వవు.

Similar News

News December 13, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News December 13, 2024

శుభ ముహూర్తం

image

తేది: డిసెంబర్ 13, శుక్రవారం
త్రయోదశి: రా.7.40 గంటలకు
భరణి: ఉ.7.49 గంటలకు
కృత్తిక: తె.5.47 గంటలకు
వర్జ్యం: 1) ఉ.6.48-8.16 గంటల వరకు
2) సా.6.48-8.16గంటల వరకు
దుర్ముహూర్తం: 1) ఉ.8.41-9.26 గంటల వరకు
2) మ.12.24- 1.08 గంటల వరకు

News December 13, 2024

గుకేశ్‌కు సినీ ప్రముఖుల అభినందనల వెల్లువ

image

18 ఏళ్లకే వరల్డ్ చెస్ ఛాంపియన్‌గా నిలిచిన గుకేశ్‌కు టాలీవుడ్ సినీ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అద్భుతమైన విజయం అందుకున్నందుకు తన హృదయం గర్వంతో ఉప్పొంగుతోందని చిరంజీవి ట్వీట్ చేశారు. అంతర్జాతీయ వేదికపై దేశాన్ని గర్వించేలా చేసినందుకు శుభాకాంక్షలు అని డైరెక్టర్ రాజమౌళి, మున్ముందు మరెన్నో విజయాలు అందుకోవాలి గ్రాండ్ సెల్యూట్ అంటూ హీరో ఎన్టీఆర్, తదితరులు గుకేశ్‌ను అభినందించారు.