News December 12, 2024

రాజ్యాన్ని కాపాడే సైనిక చీమలు

image

ప్రతి రాజ్యానికి సైనికులున్నట్లే ప్రత్యర్థుల నుంచి పుట్టలను కాపాడేందుకు ప్రత్యేకమైన చీమలు ఉంటాయి. వీటిని తాబేలు చీమలు లేదా సైనిక చీమలు అని పిలుస్తుంటారు. వీటి ప్రత్యేకమైన తలలే వీటి ఆయుధాలు. రాజ్యంలోకి ఇతర కీటకాలు రాకుండా గూళ్ల ప్రవేశాన్ని మూసేసి వాటిని అడ్డుకుంటాయి. తలను గూడు వద్ద తలుపులా ఫిక్స్ చేస్తాయి. ఏవైనా చీమలు బయటకు వెళ్లాలంటే అవి పక్కకు జరుగుతాయి. ఇవి చొరబాటుదారులను లోపలికి రానివ్వవు.

Similar News

News January 22, 2025

రేషన్ కార్డుల అంశంపై ప్రభుత్వం అప్రమత్తం

image

TG: రేషన్ కార్డుల జారీ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు. గ్రామ సభల నిర్వహణలో ఎదురవుతున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతిపక్షాలు కావాలనే గొడవ చేస్తున్నాయని, అప్రమత్తంగా ఉండాలన్నారు. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు అందుతాయన్న విషయాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు.

News January 22, 2025

అభిషేక్ శర్మ 20 బంతుల్లోనే ఫిఫ్టీ

image

ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో టీమ్ ఇండియా ఓపెనర్ అభిషేక్ శర్మ (50*) ఫిఫ్టీ పూర్తి చేసుకున్నారు. 20 బంతుల్లోనే 3 ఫోర్లు, 6 సిక్సర్లతో ఆయన అర్ధ శతకం చేశారు. ఆదిల్ రషీద్ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు బాదారు. ప్రస్తుతం భారత్ స్కోర్ 93/2గా ఉంది. టీమ్ ఇండియా విజయానికి ఇంకా 40 పరుగులు కావాల్సి ఉంది.

News January 22, 2025

మహా కుంభమేళాలో ‘ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ’ ప్రదర్శన

image

యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో వాల్మీకి రామాయణం ఆధారంగా రూపొందించిన ‘ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ’ సినిమాను ప్రదర్శించనున్నారు. సెక్టార్ 6లోని దివ్య ప్రేమ్ సేవా శిభిరంలో ప్రత్యేక స్క్రీన్ ఏర్పాటు చేశారు. తాజాగా విడుదలైన 4K వెర్షన్‌ను చూసేందుకు పాఠశాల పిల్లలు, భక్తులను ఆహ్వానిస్తున్నారు.