News December 13, 2024
నలుగురు కలెక్టర్లకు హైకోర్టు నోటీసులు
TG: రైతుల ఆత్మహత్యలపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ జరిగింది. 4 నెలలకే పరిహారం ఇస్తామన్న ప్రభుత్వం ఏడాది దాటినా పట్టించుకోలేదని కొండల్ రెడ్డి అనే వ్యక్తి ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను కోర్టు ధిక్కరణ కింద ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని హైకోర్టు ప్రశ్నించింది. ఈ మేరకు యాదాద్రి భువనగిరి, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, ఆదిలాబాద్ జిల్లాల కలెక్టర్లకు నోటీసులు జారీ చేసింది.
Similar News
News December 13, 2024
నేడు స్వర్ణాంధ్ర@2047 విజన్ డాక్యుమెంట్ లాంచ్
AP: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వర్ణాంధ్ర@2047 విజన్ డాక్యుమెంట్‌ను నేడు CM చంద్రబాబు ఆవిష్కరిస్తారు. విజయవాడలో జరిగే ఈ కార్యక్రమానికి CMతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరవుతారు. కాగా 2047 నాటికి నవ్యాంధ్రప్రదేశ్‌ను నిర్మించేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నంబర్‌వన్‌గా నిలిపి, దేశానికి ఒక రోల్ మోడల్‌గా తీర్చిదిద్దాలని సర్కార్ సంకల్పించింది.
News December 13, 2024
STOCK MARKETS: భారీ నష్టాలు తప్పవేమో!
స్టాక్‌మార్కెట్లు నేడు మిశ్రమంగా కదలాడొచ్చు. NOVలో రిటైల్ ఇన్‌ఫ్లేషన్ తగ్గడం శుభసూచకం. గ్లోబల్ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుతున్నాయి. నిన్న EU, US సూచీలన్నీ ఎరుపెక్కాయి. నేడు ఆసియా మార్కెట్లు భారీ నష్టాల్లో మొదలయ్యాయి. నిక్కీ 400, గిఫ్ట్ నిఫ్టీ 94 పాయింట్ల మేర పతనమయ్యాయి. USD/INR మరింత బలహీనపడుతోంది. STOCKS TO WATCH: HAL, Ashok Leyland, GR Infra, Zomato, Yes Bank, CRISIL, Adani Green
News December 13, 2024
ఆ రోజు సెలవు.. టెన్త్ ఎగ్జామ్ వాయిదా!
AP: పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను ప్రభుత్వం ఇప్పటికే <<14851568>>ప్రకటించింది<<>>. అయితే అందులో స్వల్ప మార్పు చోటు చేసుకునే అవకాశం ఉంది. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది MAR 31న సాంఘిక శాస్త్రం పరీక్ష జరగనుంది. క్యాలెండర్ ప్రకారం ఆరోజు రంజాన్ సెలవు ఉంది. నెలవంక కనిపించే విషయాన్ని బట్టి పండగ అదేరోజు వస్తే మరుసటి రోజు APR 1కి ఎగ్జామ్ పోస్ట్‌పోన్ చేస్తామని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.