News December 13, 2024
నలుగురు కలెక్టర్లకు హైకోర్టు నోటీసులు
TG: రైతుల ఆత్మహత్యలపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ జరిగింది. 4 నెలలకే పరిహారం ఇస్తామన్న ప్రభుత్వం ఏడాది దాటినా పట్టించుకోలేదని కొండల్ రెడ్డి అనే వ్యక్తి ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను కోర్టు ధిక్కరణ కింద ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని హైకోర్టు ప్రశ్నించింది. ఈ మేరకు యాదాద్రి భువనగిరి, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, ఆదిలాబాద్ జిల్లాల కలెక్టర్లకు నోటీసులు జారీ చేసింది.
Similar News
News January 20, 2025
శ్రీవారి భక్తులకు అలర్ట్
AP: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు నిన్నటితో ముగిశాయి. ఇవాళ భక్తులను ఎలాంటి టోకెన్లు లేకుండా స్వామివారి దర్శనానికి క్యూలైన్లలో టీటీడీ అనుమతించనుంది. నేడు ప్రోటోకాల్ మినహా సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనం, ఆఫ్‌లైన్‌లో శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల జారీ రద్దు చేసింది. తిరిగి ఈ ఏడాది డిసెంబర్‌లో వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్నాయి.
News January 20, 2025
పవిత్రతో రిలేషన్‌పై నరేశ్ ఆసక్తికర కామెంట్స్
నటి పవిత్ర వచ్చాక తన జీవితం కాస్త మెరుగుపడిందని సినీ నటుడు నరేశ్ చెప్పారు. ఇప్పుడు లైఫ్ టైటానిక్ ఒడ్డుకు చేరినట్లుగా ఉందని తనదైన శైలిలో చమత్కరించారు. అర్థం చేసుకునే మనుషులు జీవితంలో ఉంటే బాగుంటుందని ఆయన పేర్కొన్నారు. ఇక సూపర్ స్టార్ మహేశ్ బాబుతో తనకు మంచి అనుబంధం ఉందని చెప్పారు. భవిష్యత్తులోనూ ఇదే బంధం కొనసాగిస్తామన్నారు.
News January 20, 2025
ఇండియా కూటమిలో చేరాలని విజయ్‌కి ఆఫర్
విభజన శక్తులతో పోరాడేందుకు ఇండియా కూటమిలో చేరాలని తమిళగ వెట్రి కజగం చీఫ్, సినీ నటుడు విజయ్‌ని తమిళనాడు కాంగ్రెస్ చీఫ్ సెల్వపెరుంతగై కోరారు. ఇటీవల ఓ సభలో దేశంలో విభజన శక్తులు ఉన్నాయని విజయ్ అన్నారు. అలాంటి శక్తులను నిర్మూలించి, దేశానికి ప్రయోజనం చేకూర్చేందుకు తమతో చేరాలని కాంగ్రెస్ చీఫ్ సూచించారు. అయితే రాహుల్‌పై విజయ్ కొంత నమ్మకం ఉంచాలని TN బీజేపీ చీఫ్ అన్నామలై వ్యంగ్యస్త్రాలు సంధించారు.