News December 13, 2024
బాలికపై అత్యాచారం.. నిందితుడిని కొట్టి చంపిన గ్రామస్థులు
TG: నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం వీరన్నగుట్టలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బాలికపై అత్యాచారం చేశాడంటూ ఓ వృద్ధుడిని గ్రామస్థులు కొట్టి చంపారు. ఓ బాలిక సరుకుల కోసం కిరాణా దుకాణానికి వెళ్లగా నిర్వాహకుడు ఆమెపై అత్యాచారం చేశాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఆగ్రహంతో అతడిపై దాడి చేశారు. బలమైన గాయాలు కావడంతో వృద్ధుడు మరణించాడు. పోలీసులు గ్రామంలో పికెట్ ఏర్పాటు చేశారు.
Similar News
News December 27, 2024
నిగమ్‌బోధ్ ఘాట్‌లో మన్మోహన్ అంత్యక్రియలు: కేంద్రం
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను రేపు ఉదయం 11.45 గంటలకు ఢిల్లీలోని నిగమ్‌బోధ్ ఘాట్‌లో నిర్వహిస్తామని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు జరిపేందుకు ఏర్పాట్లు చేయాలని రక్షణ శాఖను కోరినట్లు పేర్కొంది. అటు మన్మోహన్ స్మారక చిహ్నం ఏర్పాటు చేయడానికి ప్రత్యేక స్థలం కేటాయించాలని ఏఐసీసీ చీఫ్ ఖర్గే ప్రధాని మోదీకి లేఖ రాశారు.
News December 27, 2024
ఆ రోజున సెలవు రద్దు
TG: 2025 ఏడాదికి సంబంధించి సాధారణ, ఆప్షనల్ సెలవుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 1న కొత్త ఏడాది సందర్భంగా సెలవు ప్రకటించింది. దీనికి బదులుగా ఫిబ్రవరి 8న రెండో శనివారం పనిదినంగా ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. జనవరి 13న భోగి, 14న సంక్రాంతికి జనరల్ హాలిడేస్ ఇచ్చింది. 15న కనుమ పండుగను ఆప్షనల్ హాలిడేగా ప్రకటించింది. సెలవుల జాబితా కోసం ఇక్కడ <
News December 27, 2024
మన్మోహన్ లెగసీని కొనసాగిస్తాం: CWC
దేశంలో సంస్కరణలకు పునాది వేసి రాజకీయ, ఆర్థిక రంగాల్లో మన్మోహన్ సింగ్ గణనీయమైన ప్రభావాన్ని చూపారని CWC కొనియాడింది. మాజీ ప్రధాని గౌరవార్థం సమావేశమైన CWC ఆయన నాయకత్వమే క్లిష్ట పరిస్థితుల్లో దేశాన్ని ముందుకు నడిపిందని కీర్తించింది. ఆయన లెగసీని కొనసాగిస్తామని తీర్మానించింది. శనివారం ఉదయం ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి మన్మోహన్ భౌతికకాయాన్ని తరలించనున్నారు.