News December 13, 2024
బాలికపై అత్యాచారం.. నిందితుడిని కొట్టి చంపిన గ్రామస్థులు
TG: నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం వీరన్నగుట్టలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బాలికపై అత్యాచారం చేశాడంటూ ఓ వృద్ధుడిని గ్రామస్థులు కొట్టి చంపారు. ఓ బాలిక సరుకుల కోసం కిరాణా దుకాణానికి వెళ్లగా నిర్వాహకుడు ఆమెపై అత్యాచారం చేశాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఆగ్రహంతో అతడిపై దాడి చేశారు. బలమైన గాయాలు కావడంతో వృద్ధుడు మరణించాడు. పోలీసులు గ్రామంలో పికెట్ ఏర్పాటు చేశారు.
Similar News
News January 14, 2025
లండన్ పర్యటనకు బయలుదేరిన జగన్
మాజీ సీఎం వైఎస్ జగన్ లండన్ పర్యటనకు బయలుదేరారు. బెంగళూరు విమానాశ్రయం నుంచి ఆయన లండన్ పర్యటనకు వెళ్లినట్టు తెలుస్తోంది. జగన్ రెండో కుమార్తె వర్షారెడ్డి King’s College Londonలో ఎంఎస్, ఫైనాన్స్ కోర్సులో డిస్టింక్షన్‌లో ఉత్తీర్ణులయ్యారు. ఆమె డిగ్రీ ప్రదానోత్సవ కార్యక్రమానికి జగన్ దంపతులు హాజరుకానున్నారు. 16న డిగ్రీ ప్రదానోత్సవం జరగనుంది. అనంతరం నెలాఖరున జగన్ లండన్ నుంచి తిరుగు ప్రయాణం అవుతారు.
News January 14, 2025
మరికాసేపట్లో మకరజ్యోతి
మరికాసేపట్లో శబరిమలలో మకరజ్యోతి దర్శనం ఇవ్వనుంది. ఈ అద్భుత దృశ్యాన్ని చూసి తరించేందుకు అయ్యప్ప మాలధారులు, భక్తులు భారీగా శబరిమలకు చేరుకున్నారు. భక్తుల శరణుఘోషతో శబరిగిరులు మార్మోగుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఆలయ అధికారులు, పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.
News January 14, 2025
అడిగిన ప్రతి రైతుకూ డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు: సీఎం చంద్రబాబు
AP: సంక్షేమ పథకాల అమలులో మోసాలు జరగకుండా సాంకేతికతను వినియోగిస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. రైతుల అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అడిగిన ప్రతి ఒక్కరికీ డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు అందిస్తామని, పశువులకు షెడ్లు నిర్మిస్తామని ప్రకటించారు. కిరాణా దుకాణాల ద్వారా సరకుల పంపిణీ చేపడతామన్నారు. ప్రజల ఆదాయం పెంచడం, పర్యావరణ పరిరక్షణే తన లక్ష్యమని పేర్కొన్నారు.