News December 14, 2024
చిలుకూరులో CM రేవంత్ రెడ్డి.. భారీ బందోబస్తు

చేవెళ్ల నియోజకవర్గంలో CM రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. శనివారం ఉదయం చిలుకూరు గురుకుల పాఠశాలను ఆయన సందర్శించారు. ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, MLA కాలే యాదయ్య ఆయనకు స్వాగతం పలికారు. పాఠశాల ఆవరణలో చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలను రేవంత్ రెడ్డి ఆసక్తిగా తిలకించారు. CM రాకతో మొయినాబాద్ మండల వ్యాప్తంగా, సభ వద్ద పోలీసులు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు.
Similar News
News January 28, 2026
HYD: ఘోర ప్రమాదం.. చనిపోయింది వీరే..!

మేడిపల్లిలో అర్ధరాత్రి ఘోర రోడ్డుప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. మౌలాలిలో శుభకార్యానికి 8మంది BTECH విద్యార్థులు వెళ్లారు. ఫంక్షన్ అనంతరం పోచారంలో ఉండే స్నేహితులను దింపేందుకు కారులో బయలుదేరారు. మేడిపల్లికి చేరగానే అదుపు తప్పిన కారు ఎలివేటెడ్ పిల్లర్‌ను ఢీకొట్టింది. నిఖిల్(22), సాయివరుణ్(23) అక్కడికక్కడే చనిపోయారు. ఒకరికి తీవ్ర, నలుగురికి స్పల్ప గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
News January 28, 2026
300 డివిజన్లలో ఆన్‌లైన్‌లోనే బర్త్, డెత్ సర్టిఫికెట్లు

GHMCలో 27 ULBల విలీనంతో 300 డివిజన్లు, 60 సర్కిళ్లకు విస్తరించింది. బర్త్, డెత్ ధ్రువీకరణలను డిజిటల్‌గా అప్‌గ్రేడ్ చేశారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులను అనుసంధానించి, వార్డు, సర్కిల్ మ్యాపింగ్‌తో కొత్త ఆన్‌లైన్ అప్లికేషన్‌ను అమల్లోకి తీసుకొచ్చారు. మీసేవ కేంద్రాల ద్వారా ఆస్పత్రి లేదా ఫీల్డ్ వెరిఫికేషన్ ఆధారంగా దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతో ప్రజలకు సేవలు త్వరితగతిన అందనున్నాయి.
#SHARE IT
News January 28, 2026
HYD: రియల్ ఎస్టేట్ బిజినెస్ తగ్గుతోందా?

మహానగరంతోపాటు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ తగ్గుతోందా అంటే అవుననే సమాధానం వస్తోంది. 2024తో పోలిస్తే 2025లో ఇళ్ల కొనుగోళ్లు తగ్గాయని రిజిస్ట్రేషన్ గణాంకాలు చెబుతున్నాయి. 2024లో 76,613 ఇళ్లు రిజిస్ట్రేషన్ జరగ్గా 2025లో 75,222 ఇళ్లకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ లెక్కలు చూస్తే మరి ఈ ఏడాది ఎలా ఉంటుందోనని రియల్ వర్గాలు పేర్కొంటున్నాయి.


