News December 15, 2024
WPL వేలం: రూ.55 లక్షలు పలికిన ఆంధ్రా ప్లేయర్
WPL వేలంలో ఆంధ్ర ప్లేయర్ శ్రీ చరణి పంట పండింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఈమెను రూ.55 లక్షలకు దక్కించుకుంది. జాతీయ స్థాయిలో చరణి ఇండియాC తరఫున ఆడారు. కడపకు చెందిన ఈ 20 ఏళ్ల ప్లేయర్ ఆల్‌రౌండర్ కావడం గమనార్హం.
Similar News
News February 5, 2025
నెట్‌ఫ్లిక్స్‌లోనూ పుష్ప-2 హవా
థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టించిన పుష్ప-2 సినిమా ఓటీటీలోనూ దుమారం రేపుతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన 4రోజుల్లోనే 5.8 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. 7 దేశాల్లో వ్యూయర్‌షిప్‌లో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లిషేతర కేటగిరీల్లో రెండో స్థానంలో ట్రెండ్ అవుతోంది. థియేటర్లలో ఈ మూవీ రూ.1850 కోట్లపై చిలుకు వసూలు చేసిన సంగతి తెలిసిందే.
News February 5, 2025
నాటు-నాటు ఫోజులో ‘NTR’ పోస్టర్ షేర్ చేసిన ‘ఫిఫా వరల్డ్ కప్’
ప్రముఖ ఫుట్‌బాల్ ప్లేయర్లు నేమార్, టెవెజ్, రొనాల్డో బర్త్ డే కావడంతో ‘ఫిఫా వరల్డ్’ కప్ ఇంట్రెస్టింగ్‌గా విష్ చేసింది. ఈ ముగ్గురూ ‘RRR’ సినిమాలోని నాటునాటు స్టెప్ వేసినట్లు పోస్టర్‌పై NTR అని ఉంచి ఇన్‌స్టాలో షేర్ చేసింది. దీనికి యంగ్ టైగర్ ఎన్టీఆర్, RRR టీమ్ సైతం స్పందిస్తూ వారికి విషెస్ తెలియజేశారు.
News February 5, 2025
రక్షణ మంత్రితో ముగిసిన లోకేశ్ భేటీ.. వాటికోసం విజ్ఞప్తి
AP: ఢిల్లీలో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో మంత్రి లోకేశ్ భేటీ ముగిసింది. రాష్ట్రంలో NDA సర్కారు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆయనకు వివరించిన లోకేశ్, రక్షణ రంగానికి సంబంధించిన పలు పెట్టుబడుల్ని APలో పెట్టాలని కోరారు. డిఫెన్స్ క్లస్టర్, రక్షణ రంగ పరికరాల తయారీలో కొన్ని యూనిట్లను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రాకు తమ వంతు సహకారం అందిస్తామని ఆయనకు రాజ్‌నాథ్ హామీ ఇచ్చారు.