News December 15, 2024
WPL వేలం: రూ.55 లక్షలు పలికిన ఆంధ్రా ప్లేయర్
WPL వేలంలో ఆంధ్ర ప్లేయర్ శ్రీ చరణి పంట పండింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఈమెను రూ.55 లక్షలకు దక్కించుకుంది. జాతీయ స్థాయిలో చరణి ఇండియాC తరఫున ఆడారు. కడపకు చెందిన ఈ 20 ఏళ్ల ప్లేయర్ ఆల్‌రౌండర్ కావడం గమనార్హం.
Similar News
News January 22, 2025
వక్ఫ్ బిల్లుకు కేరళ కాంగ్రెస్ ఎంపీ జార్జ్ మద్దతు
మోదీ సర్కార్ తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ బిల్లుకు ‘INDIA’ సభ్యుడు, కేరళ కాంగ్రెస్ MP ఫ్రాన్సిస్ జార్జ్ మద్దతు ప్రకటించారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా కేంద్రం దీనిని పాస్ చేయాలన్నారు. నీతి, నిజాయతీకి తాను కట్టుబడతానని, వీటిని అనుసరించేవారికి తన పార్టీ సహకరిస్తుందని అన్నారు. మునంబమ్ భూమిని వక్ఫ్ లాగేసుకోవడంపై పోరాటం 100 రోజులకు చేరింది. దీనిపై క్రిస్టియన్ ట్రస్ట్ సర్వీస్ ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.
News January 22, 2025
నిజమైన ప్రేమ దొరకడం కష్టమే: చాహల్
తన భార్య ధనశ్రీ వర్మతో విడాకుల రూమర్ల నేపథ్యంలో టీమ్ ఇండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ సోషల్ మీడియాలో మరో పోస్ట్ పెట్టారు. ‘నిజమైన ప్రేమ చాలా అరుదు.. నా పేరు కూడా అలాంటిదే’ అంటూ ఆయన పోస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఇంగ్లండ్‌తో జరిగే టీ20 సిరీస్, పాక్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి చాహల్‌ను ఎంపిక చేయలేదు. దీంతో BCCIపై ఫ్యాన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు.
News January 22, 2025
దావోస్‌లో టీమ్ ఇండియా: సీఎం చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్, మహారాష్ట్ర సీఎం ఫడణవీస్ దావోస్‌లో భేటీ అయ్యారు. ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో టీమ్ ఇండియా’ అంటూ ఈ ఫొటోను చంద్రబాబు Xలో పోస్ట్ చేశారు. దేశం, రాష్ట్రాల అభివృద్ధి, సంక్షేమం, ఆర్థిక వ్యవస్థ, ఆవిష్కరణలు, సాంకేతికత, ఏఐ, ఉద్యోగాలు వంటి అనేక అంశాలపై వీరు చర్చించినట్లు సమాచారం.