News December 16, 2024

నేడు తీవ్ర అల్పపీడనం.. వర్షాలు

image

AP: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ తీవ్ర అల్పపీడనంగా మారి వాయవ్య దిశగా ప్రయాణిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. ఎల్లుండి ఉదయం తమిళనాడులో తీరం దాటే అవకాశముందని పేర్కొంది. దీని ప్రభావంతో ఇవాళ నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు పడతాయని, రేపు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

Similar News

News January 21, 2026

DRDOలో JRF పోస్టులు

image

బెంగళూరులోని <>DRDO<<>> యంగ్ సైంటిస్ట్ లాబోరేటరీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(DYDL-AI)లో 2 JRF పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. BE/BTech, ME/MTech, NET/GATE అర్హతగల అభ్యర్థులు రేపటివరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.drdo.gov.in

News January 21, 2026

నెలసరిలో ఏం తినాలంటే..?

image

చాలామంది మహిళలు పీరియడ్స్‌లో క్రేవింగ్స్ వస్తున్నాయని తీపి పదార్థాలు ఎక్కువగా తింటారు. అయితే వీటివల్ల నెలసరి సమస్యలు మరింత పెరుగుతున్నాయంటున్నారు నిపుణులు. ఈ సమయంలో చికెన్, బటానీలు, బీన్స్, పప్పులు, టోఫు, అంజీరా, ఎండుద్రాక్ష, బ్రోకలీ, ఆకుకూరలు, పిస్తా, గుమ్మడి విత్తనాలు, స్ట్రాబెర్రీ, కర్బూజా, యాప్రికాట్, బ్రోకలీ, ఆకుకూరలు, నిమ్మకాయ, నారింజ, బత్తాయి, పీచుపదార్థాలు ఎక్కువగా తినాలని సూచిస్తున్నారు.

News January 21, 2026

ప్యాడ్స్ వాడితే దద్దుర్లు వస్తున్నాయా?

image

పీరియడ్స్‌లో అమ్మాయిలు చాలా అసౌకర్యానికి గురవుతారు. ముఖ్యంగా ప్యాడ్స్ వాడటం వల్ల దద్దుర్లు, దురద వేధిస్తాయి. ఇలా కాకుండా ఉండాలంటే కాటన్ ప్యాడ్స్ వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. సెంటెడ్ ప్లాస్టిక్ పూత ఉన్న ప్యాడ్స్ వల్ల గాలి ప్రసరణ జరగక సమస్యలు వస్తాయంటున్నారు. అలాగే 4-6 గంటలకోసారి ప్యాడ్ మార్చాలి. మైల్డ్ సబ్బు, గోరువెచ్చని నీటితో వెజినాని క్లీన్ చేయడం వల్ల కూడా సమస్య అదుపులో ఉంటుంది.