News December 16, 2024
నేడు తీవ్ర అల్పపీడనం.. వర్షాలు
AP: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ తీవ్ర అల్పపీడనంగా మారి వాయవ్య దిశగా ప్రయాణిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. ఎల్లుండి ఉదయం తమిళనాడులో తీరం దాటే అవకాశముందని పేర్కొంది. దీని ప్రభావంతో ఇవాళ నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు పడతాయని, రేపు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
Similar News
News January 25, 2025
విజయసాయి బీజేపీలో చేరడం లేదు: పురందీశ్వరి
AP: విజయసాయి రెడ్డి బీజేపీలో చేరుతారన్న ప్రచారాన్ని నమ్మొద్దని రాష్ట్ర బీజేపీ చీఫ్ పురందీశ్వరి అన్నారు. ‘విజయసాయి బీజేపీలో చేరుతారని ప్రధాని మోదీ, అమిత్ షా చెప్పారా? ప్రతి సభ్యుడికి వారిద్దరూ సపోర్ట్‌గా ఉంటారు. వారికి ధన్యవాదాలు తెలుపుతూ తనకు సపోర్ట్ చేశారని మాత్రమే VSR అన్నారు’ అని గుర్తుచేశారు.
News January 25, 2025
ఆసుపత్రిపై డ్రోన్ దాడి.. 30 మంది మృతి!
ఆఫ్రికా దేశం సూడాన్‌లోని ఆసుపత్రిపై డ్రోన్ దాడి కలకలం రేపింది. ఈ దాడిలో ఏకంగా 30 మంది మరణించగా పదుల సంఖ్యలో గాయపడినట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. 2023 ఏప్రిల్ నుంచి ఈ దేశంలో సూడాన్ ఆర్మీకి అక్కడ రాపిడ్ ఫోర్స్‌కి మధ్య యుద్ధం కొనసాగుతోంది. కొన్ని వారాల క్రితం ఆసుపత్రిపై ఇదే తరహా డ్రోన్ దాడి జరిగినట్లు వైద్య వర్గాలు పేర్కొన్నాయి.
News January 25, 2025
నమ్మిన వాళ్లను జగన్ మోసం చేశారు: షర్మిల
AP: బీజేపీకి జగన్ దత్తపుత్రుడు అని ఏపీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. జగన్ విశ్వసనీయత కోల్పోయారు కాబట్టే విజయసాయి రెడ్డి వైసీపీని వీడారని అన్నారు. ‘జగన్‌కు విజయసాయి అత్యంత సన్నిహితుడు. ఎవరిని తిట్టమంటే వారిని తిడతాడు. అలాంటి ఆయన రాజీనామా చేశారంటే చిన్న విషయం కాదు. నమ్మిన వాళ్లను జగన్ మోసం చేశారు. నా అనుకున్న వాళ్లను కాపాడుకోలేక పోతున్నారు. VSRను BJPలోకి పంపుతున్నారు’ అని ఆరోపించారు.