News December 16, 2024

కిల్లర్ సిస్టర్

image

AP: తండ్రి మరణం తర్వాత వచ్చే డబ్బు కోసం ఓ మహిళ సొంత అన్నదమ్ములనే చంపిన ఘటన పల్నాడు(D) నకరికల్లులో జరిగింది. ప్రభుత్వ టీచర్ పౌలిరాజు ఇటీవల మరణించాడు. ప్రభుత్వం నుంచి వచ్చే రూ.40లక్షల కోసం కుమారులు గోపీకృష్ణ(కానిస్టేబుల్), రామకృష్ణ(టీచర్), కూతురు కృష్ణవేణి మధ్య గొడవలు జరిగాయి. దీంతో గతనెల 26న తమ్ముడిని, ఈనెల 10న అన్నను చంపిన కృష్ణవేణి వారి మృతదేహాలను కెనాల్‌లో పడేసింది. పోలీసులు అరెస్ట్ చేశారు.

Similar News

News September 19, 2025

లిక్కర్ స్కాం కేసు: ఈడీ సోదాల్లో రూ.38లక్షలు స్వాధీనం

image

AP: లిక్కర్ స్కాం కేసులో దేశ వ్యాప్తంగా 20 ప్రాంతాల్లో <<17748928>>2వ రోజు<<>> ED సోదాలు నిర్వహించింది. HYD, బెంగళూరు, చెన్నై, తంజావూరులో తనిఖీలు చేసి లెక్కల్లో చూపని రూ.38లక్షలు స్వాధీనం చేసుకుంది. లిక్కర్ స్కాంలో ప్రభుత్వ ఖజానాకు రూ.4వేల కోట్లు నష్టం వాటిల్లిందని.. ప్రధాన మద్యం బ్రాండ్ల స్థానంలో నిందితులు కొత్త మద్యం బ్రాండ్లు తీసుకొచ్చారని FIRలో సీఐడీ పేర్కొంది. దీని ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపట్టింది.

News September 19, 2025

నేను రాలేదు.. కాంగ్రెస్సే నన్ను బయటకి పంపింది: తీన్మార్ మల్లన్న

image

TG: కాంగ్రెస్ నుంచి తాను బయటికి రాలేదని, ఆ పార్టీయే తనను బయటకు పంపిందని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. ‘ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం ముగిశాక నా ఎమ్మెల్సీ పదవి గురించి ఆలోచిద్దాం. సీఎం రేవంత్ బీసీల ద్రోహి. భూమిలేని రైతులకు రెండెకరాల భూమి ఇవ్వాలి. వరంగల్‌ను రెండో రాజధానిగా ప్రకటించాలి. తాము అధికారంలోకి వస్తే విద్య, వైద్యం ఉచితంగా అందిస్తాం’ అని తెలిపారు.

News September 19, 2025

కొత్త మేకప్ ట్రెండ్.. జంసూ

image

కొరియన్ అమ్మాయిలైనా, అబ్బాయిలైనా వాళ్ల ముఖంలో ఒక మెరుపు ఉంటుంది. అందుకే చాలామంది కొరియన్ ట్రెండ్స్‌నే ఫాలో అవుతుంటారు. వాటిల్లో కొత్తగా వచ్చిందే జంసూ. ముందుగా ముఖానికి బేబీ పౌడర్ పూసుకుని, పెద్ద గిన్నెలో చల్లటి నీళ్లు వేసి, పౌడర్ రాసుకున్న ముఖాన్ని 30 సెకన్ల పాటు ఆ నీళ్లలో ఉంచుతారు. దీని వల్ల ముఖానికి వేసుకున్న మేకప్ ఎక్కువ సేపు ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా దీన్ని ప్రయత్నించి చూడండి.