News December 16, 2024
కిల్లర్ సిస్టర్
AP: తండ్రి మరణం తర్వాత వచ్చే డబ్బు కోసం ఓ మహిళ సొంత అన్నదమ్ములనే చంపిన ఘటన పల్నాడు(D) నకరికల్లులో జరిగింది. ప్రభుత్వ టీచర్ పౌలిరాజు ఇటీవల మరణించాడు. ప్రభుత్వం నుంచి వచ్చే రూ.40లక్షల కోసం కుమారులు గోపీకృష్ణ(కానిస్టేబుల్), రామకృష్ణ(టీచర్), కూతురు కృష్ణవేణి మధ్య గొడవలు జరిగాయి. దీంతో గతనెల 26న తమ్ముడిని, ఈనెల 10న అన్నను చంపిన కృష్ణవేణి వారి మృతదేహాలను కెనాల్‌లో పడేసింది. పోలీసులు అరెస్ట్ చేశారు.
Similar News
News January 14, 2025
వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ రివ్యూ
కిడ్నాపైన హై ప్రొఫైల్ వ్యాపారిని రక్షించేందుకు సస్పెండైన పోలీస్ ఏం చేశాడనేదే ‘సంక్రాంతికి వస్తున్నాం’ స్టోరీ. హీరో వెంకటేశ్, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షిల మధ్య సాగే సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. వెంకీ కుమారుడు బుల్లిరాజు పాత్ర, సాంగ్స్, కామెడీ సినిమాకు హైలైట్. డైరెక్టర్ అనిల్ రావిపూడి స్టోరీ కంటే కామెడీపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ స్లోగా సాగుతుంది.
RATING: 2.75/5
News January 14, 2025
రోడ్డు ప్రమాదం.. మంత్రికి తప్పిన ముప్పు
కర్ణాటక మంత్రి హెబ్బాల్కర్ లక్ష్మి త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. బెళగావి జిల్లాలో ఆమె ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు చెట్టును బలంగా ఢీకొట్టింది. కుక్క రోడ్డును దాటుతుండగా దాన్ని తప్పించేందుకు టర్న్ చేయడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో కారు ముందరి భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. మంత్రి ముఖం, నడుముకు స్వల్ప గాయాలయ్యాయి.
News January 14, 2025
Stock Markets: లాభాల్లో పరుగులు..
స్టాక్‌మార్కెట్లు మోస్తరు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇప్పటికే సూచీలు ఎక్కువ పతనమవ్వడంతో ఇన్వెస్టర్లు ఆకర్షణీమైన షేర్లను కొనుగోలు చేస్తున్నారు. నిఫ్టీ 23,201 (+116), సెన్సెక్స్ 76,717 (+387) వద్ద ట్రేడవుతున్నాయి. FMC, IT షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ ఉంది. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్, మీడియా, మెటల్, PSU బ్యాంకు, O&G షేర్లకు డిమాండ్ ఉంది. ADANIENT, NTPC, INDUSIND, TATAMOTORS, ADANIPORTS టాప్ గెయినర్స్.