News December 16, 2024
రాజకీయ భక్తి నియంతృత్వానికి దారి: ఖర్గే

‘మతపరమైన భక్తి ఆత్మశుద్ధికి దోహదం చేయవచ్చు. అదే రాజకీయాల్లో భక్తి నియంతృత్వానికి దారి తీస్తుంది. ఆయన నియంత అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు’ అంటూ మోదీని ఖర్గే ఘాటుగా విమర్శించారు. రాజ్యాంగంపై చర్చలో ఖర్గే మాట్లాడుతూ.. 1947-52లో ఎన్నికైన ప్రభుత్వం లేనప్పుడు రాజ్యాంగ సవరణకు నెహ్రూ ప్రయత్నించారంటూ మోదీ తప్పుదోవ పట్టిస్తున్నారని, ఆయనో పెద్ద అబద్ధాల కోరు అని విమర్శించారు.
Similar News
News November 7, 2025
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

నిన్న పెరిగిన బంగారం ధరలు ఇవాళ కాస్త తగ్గి కొనుగోలుదారులకు ఉపశమనాన్నిచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.550 తగ్గి రూ.1,22,020కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.470 పతనమై రూ.1,11,880 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. కేజీ సిల్వర్ రేటు రూ.1,65,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News November 7, 2025
సూర్య బ్యాడ్ ఫామ్.. 18 ఇన్నింగ్సుల్లో నో ఫిఫ్టీ!

IND టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. అతడు గత 18 టీ20ల్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయారు. 7 సార్లు(+3 డకౌట్లు) సింగిల్ డిజిట్ స్కోర్‌కే ఔటయ్యారు. అత్యధిక స్కోర్ 47*. కెప్టెన్సీ భారం వల్లే సూర్య ఫెయిల్ అవుతున్నారా? లేదా బ్యాటింగ్ ఆర్డర్‌లో పదేపదే మార్పుల వల్ల విఫలం అవుతున్నారా? అనే చర్చ మొదలైంది. వచ్చే ఏడాది T20WC నేపథ్యంలో సూర్య ఫామ్ అందుకోవాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
News November 7, 2025
రెండు శనివారాల్లో పనిపై పునరాలోచించండి: APTF

AP: తుఫాను కారణంగా స్కూళ్లకు ఇచ్చిన సెలవులకు పరిహారంగా రెండు శనివారాలు పనిచేయాలంటూ ఇచ్చిన ఉత్తర్వులను సమీక్షించాలని ఏపీటీఎఫ్ కోరింది. 220 పనిదినాలు సర్దుబాటయ్యే స్కూళ్లను ఈ ఉత్తర్వుల నుంచి మినహాయించాలంది. అలాగే నవంబర్ 10న మూడో కార్తీక సోమవారం, 14న బాలల దినోత్సవం సందర్భంగా గ్రామాల్లో సమ్మేటివ్ పరీక్షల షెడ్యూల్ మార్చాలని ఉపాధ్యాయ సంఘాలు కోరాయి.


