News December 16, 2024

రాజకీయ భక్తి నియంతృత్వానికి దారి: ఖర్గే

image

‘మ‌త‌ప‌ర‌మైన భ‌క్తి ఆత్మ‌శుద్ధికి దోహ‌దం చేయ‌వ‌చ్చు. అదే రాజ‌కీయాల్లో భ‌క్తి నియంతృత్వానికి దారి తీస్తుంది. ఆయ‌న నియంత అవ్వ‌డానికి సిద్ధంగా ఉన్నారు’ అంటూ మోదీని ఖర్గే ఘాటుగా విమర్శించారు. రాజ్యాంగంపై చ‌ర్చ‌లో ఖ‌ర్గే మాట్లాడుతూ.. 1947-52లో ఎన్నికైన ప్ర‌భుత్వం లేనప్పుడు రాజ్యాంగ స‌వ‌ర‌ణ‌కు నెహ్రూ ప్ర‌య‌త్నించారంటూ మోదీ త‌ప్పుదోవ‌ ప‌ట్టిస్తున్నార‌ని, ఆయ‌నో పెద్ద అబ‌ద్ధాల కోరు అని విమ‌ర్శించారు.

Similar News

News January 22, 2025

జేడీయూ U టర్న్.. బీజేపీతోనే ఉన్నామని ప్రకటన

image

మణిపుర్‌లో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నట్టు వచ్చిన వార్తలపై జేడీయూ స్పందించింది. సెంట్రల్ లీడర్‌షిప్‌కు తెలియకుండానే లోకల్ చీఫ్ క్షేత్రిమయుమ్ బిరేన్ సొంతంగా గవర్నర్‌కు లేఖరాశారని వివరణ ఇచ్చింది. క్రమశిక్షణా రాహిత్యం కింద వెంటనే అతడిని బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్టు ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజీవ్ రంజన్ తెలిపారు. తాము బీజేపీకే మద్దతు ఇస్తున్నామని స్పష్టం చేశారు.

News January 22, 2025

వక్ఫ్ బిల్లుకు కేరళ కాంగ్రెస్ ఎంపీ జార్జ్ మద్దతు

image

మోదీ సర్కార్ తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ బిల్లుకు ‘INDIA’ సభ్యుడు, కేరళ కాంగ్రెస్ MP ఫ్రాన్సిస్ జార్జ్ మద్దతు ప్రకటించారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా కేంద్రం దీనిని పాస్ చేయాలన్నారు. నీతి, నిజాయతీకి తాను కట్టుబడతానని, వీటిని అనుసరించేవారికి తన పార్టీ సహకరిస్తుందని అన్నారు. మునంబమ్‌ భూమిని వక్ఫ్ లాగేసుకోవడంపై పోరాటం 100 రోజులకు చేరింది. దీనిపై క్రిస్టియన్ ట్రస్ట్ సర్వీస్ ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.

News January 22, 2025

నిజమైన ప్రేమ దొరకడం కష్టమే: చాహల్

image

తన భార్య ధనశ్రీ వర్మతో విడాకుల రూమర్ల నేపథ్యంలో టీమ్ ఇండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ సోషల్ మీడియాలో మరో పోస్ట్ పెట్టారు. ‘నిజమైన ప్రేమ చాలా అరుదు.. నా పేరు కూడా అలాంటిదే’ అంటూ ఆయన పోస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఇంగ్లండ్‌తో జరిగే టీ20 సిరీస్, పాక్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి చాహల్‌ను ఎంపిక చేయలేదు. దీంతో BCCIపై ఫ్యాన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు.