News December 16, 2024
‘నా ఫ్రెండ్ సొరోస్‌ను కలిశాను’.. రచ్చలేపిన థరూర్ పాత ట్వీట్

‘నా పాత ఫ్రెండ్ జార్జ్ సొరోస్‌ను కలిశాను’ అని 2009లో చేసిన ట్వీట్ ఇప్పుడు వైరలవ్వడంతో కాంగ్రెస్ MP శశిథరూర్ ఉలిక్కిపడ్డారు. భారత వ్యతిరేకితో మీకేం పనంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపించడంతో వివరణ ఇచ్చారు. ‘నేను UNలో ఉన్నప్పటి నుంచి ఓ సాధారణ ఫ్రెండ్‌గా సొరోస్ తెలుసు. అతడు, అతడి సంస్థల నుంచి నేను ఒక్క రూపాయీ తీసుకోలేదు. అతడి ఐడియాలజీకి మద్దతివ్వలేదు. రాజకీయంగా అతడితో అస్సలు సంబంధం లేద’ని చెప్పారు.
Similar News
News September 19, 2025
లిక్కర్ స్కాం కేసు: ఈడీ సోదాల్లో రూ.38లక్షలు స్వాధీనం

AP: లిక్కర్ స్కాం కేసులో దేశ వ్యాప్తంగా 20 ప్రాంతాల్లో <<17748928>>2వ రోజు<<>> ED సోదాలు నిర్వహించింది. HYD, బెంగళూరు, చెన్నై, తంజావూరులో తనిఖీలు చేసి లెక్కల్లో చూపని రూ.38లక్షలు స్వాధీనం చేసుకుంది. లిక్కర్ స్కాంలో ప్రభుత్వ ఖజానాకు రూ.4వేల కోట్లు నష్టం వాటిల్లిందని.. ప్రధాన మద్యం బ్రాండ్ల స్థానంలో నిందితులు కొత్త మద్యం బ్రాండ్లు తీసుకొచ్చారని FIRలో సీఐడీ పేర్కొంది. దీని ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపట్టింది.
News September 19, 2025
నేను రాలేదు.. కాంగ్రెస్సే నన్ను బయటకి పంపింది: తీన్మార్ మల్లన్న

TG: కాంగ్రెస్ నుంచి తాను బయటికి రాలేదని, ఆ పార్టీయే తనను బయటకు పంపిందని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. ‘ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం ముగిశాక నా ఎమ్మెల్సీ పదవి గురించి ఆలోచిద్దాం. సీఎం రేవంత్ బీసీల ద్రోహి. భూమిలేని రైతులకు రెండెకరాల భూమి ఇవ్వాలి. వరంగల్‌ను రెండో రాజధానిగా ప్రకటించాలి. తాము అధికారంలోకి వస్తే విద్య, వైద్యం ఉచితంగా అందిస్తాం’ అని తెలిపారు.
News September 19, 2025
కొత్త మేకప్ ట్రెండ్.. జంసూ

కొరియన్ అమ్మాయిలైనా, అబ్బాయిలైనా వాళ్ల ముఖంలో ఒక మెరుపు ఉంటుంది. అందుకే చాలామంది కొరియన్ ట్రెండ్స్‌నే ఫాలో అవుతుంటారు. వాటిల్లో కొత్తగా వచ్చిందే జంసూ. ముందుగా ముఖానికి బేబీ పౌడర్ పూసుకుని, పెద్ద గిన్నెలో చల్లటి నీళ్లు వేసి, పౌడర్ రాసుకున్న ముఖాన్ని 30 సెకన్ల పాటు ఆ నీళ్లలో ఉంచుతారు. దీని వల్ల ముఖానికి వేసుకున్న మేకప్ ఎక్కువ సేపు ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా దీన్ని ప్రయత్నించి చూడండి.