News December 16, 2024
UPIలో డబ్బులు పంపిస్తే ఛార్జీలు.. కేంద్రం స్పష్టత

యూపీఐ ట్రాన్సాక్షన్లపై ఛార్జీలు విధిస్తారనే ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. రూ.2,000కు పైగా ట్రాన్సాక్షన్ చేస్తే 1.1% ఛార్జీలు కట్టాల్సి ఉంటుందని పలు టీవీ ఛానళ్లు, సైట్లు ప్రచారం చేస్తున్నాయని, ఇది పూర్తిగా అవాస్తవమని PIB ఫ్యాక్ట్‌చెక్ స్పష్టం చేసింది. సాధారణ UPI ట్రాన్సాక్షన్లపై ఎలాంటి ఛార్జీలు లేవని తెలిపింది. డిజిటల్ వ్యాలెట్లైన ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రూమెంట్ల (PPI)పైనే ఛార్జీలు ఉంటాయంది.
Similar News
News January 5, 2026
రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’.. ఇదే తొలిసారి

TG: ఢిల్లీలో ఈ నెల 26న జరిగే రిపబ్లిక్ డే వేడుకల్లో రాష్ట్ర కళాకారులు ఒగ్గుడోలు ప్రదర్శన ఇవ్వనున్నారు. రాష్ట్ర సాంస్కృతిక జీవనంలో భాగమైన ఒగ్గుడోలు ప్రదర్శనకు రిపబ్లిక్ డే పరేడ్‌లో చోటు దక్కడం ఇదే తొలిసారి. ఇందుకోసం సిద్దిపేట, జనగామ, జగిత్యాల, వికారాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల నుంచి 30 మంది కళాకారులను ఎంపిక చేశారు. వీరంతా ఈ నెల 7వ తేదీన ఢిల్లీ వెళ్లి 8వ తేదీ నుంచి రిహార్సల్స్ చేయనున్నారు.
News January 5, 2026
అల్పపీడనం.. రాష్ట్రంలో మోస్తరు వర్షాలు

AP: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీంతో ఈ నెల 8వ తేదీ తర్వాత శ్రీలంక సమీపంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ నిపుణులు తెలిపారు. 9వ తేదీ నుంచి TNతో పాటు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అంచనా వేశారు. మరోవైపు రానున్న 3 రోజుల్లో అల్లూరి, ఏలూరు, ప.గో., NTR, పల్నాడు, గుంటూరు, ప్రకాశం, కడప జిల్లాల్లో మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణశాఖ చెప్పింది.
News January 5, 2026
శివ మానస పూజలో చదవాల్సిన మంత్రాలు

‘శివ మానస పూజ స్తోత్రం’ దీనికి ప్రధాన మంత్రం. ఇది ‘రత్నైః కల్పితమాసనం’ అని మొదలవుతుంది. ఈ స్తోత్రం చదవడం వీలుకాకపోతే కేవలం ‘ఓం నమః శివాయ’ అనే పంచాక్షరి మంత్రాన్ని మనసులో జపిస్తూ పూజ చేయవచ్చు. లేదా ‘శివోహం శివోహం’ అని స్మరించవచ్చు. చివరగా ‘ఆత్మా త్వం గిరిజా మతిః’ అనే శ్లోకాన్ని పఠించినా విశేష ఫలితాలుంటాయి. ఈ పూజలో మన ప్రతి కర్మను శివుడికి అర్పించాలి. శివ మానస పూజను ఎవరైనా, ఎప్పుడైనా ఆచరించవచ్చు.


