News December 16, 2024

UPIలో డబ్బులు పంపిస్తే ఛార్జీలు.. కేంద్రం స్పష్టత

image

యూపీఐ ట్రాన్సాక్షన్లపై ఛార్జీలు విధిస్తారనే ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. రూ.2,000కు పైగా ట్రాన్సాక్షన్ చేస్తే 1.1% ఛార్జీలు కట్టాల్సి ఉంటుందని పలు టీవీ ఛానళ్లు, సైట్లు ప్రచారం చేస్తున్నాయని, ఇది పూర్తిగా అవాస్తవమని PIB ఫ్యాక్ట్‌చెక్ స్పష్టం చేసింది. సాధారణ UPI ట్రాన్సాక్షన్లపై ఎలాంటి ఛార్జీలు లేవని తెలిపింది. డిజిటల్ వ్యాలెట్లైన ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రూమెంట్ల (PPI)పైనే ఛార్జీలు ఉంటాయంది.

Similar News

News January 25, 2025

రజినీకాంత్ ‘జైలర్ 2’లో బాలకృష్ణ?

image

సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కనున్న ‘జైలర్ 2’ మూవీ నుంచి ఓ క్రేజీ రూమర్ వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు నందమూరి బాలకృష్ణ నటించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమవుతుందని సమాచారం. బాలయ్య ప్రస్తుతం బోయపాటి తెరకెక్కించే ‘అఖండ 2’ మూవీతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత గోపీచంద్ మలినేనితో ఓ సినిమా చేయనున్నారు. ఇదే సమయంలో ‘జైలర్ 2‌’లో నటిస్తారని టాక్.

News January 25, 2025

ఇలాంటి వారు అరటిపండు తినకూడదా?

image

అరటి పండుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ కొందరు వీటిని తినకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలర్జీ, శ్వాసకోస సమస్యలు, ఆస్తమా బాధితులు తినకూడదు. మలబద్ధకం ఉన్న వారు తింటే అది మరింత తీవ్రం కావచ్చు. కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఎక్కువగా తినకూడదు. బీపీ, షుగర్ ఉన్నవారు, అధిక బరువుతో సతమతమయ్యేవారు తినకుంటేనే మంచిది. అరటిలో చక్కెర శాతం ఎక్కువ కాబట్టి వీరికి అంతగా మేలు చేయదు.

News January 25, 2025

పొగమంచు వల్లే స్పిన్ ఆడటం కష్టమైంది: బ్రూక్

image

కోల్‌కతా‌లో జరిగిన తొలి T20లో ENG బ్యాటర్లు స్పిన్ బౌలింగ్ ఆడటంలో తడబడ్డారు. దీనికి పొగమంచే కారణమని ఆ జట్టు VC బ్రూక్ తెలిపారు. ‘చక్రవర్తి చాలా మంచి బౌలర్. పొగ మంచు వల్ల అతడి బౌలింగ్‌ను ఎదుర్కోవడం మరింత కష్టమైంది. చెన్నైలో అలాంటి సమస్య ఉండదని అనుకుంటున్నా. T20 క్రికెట్‌లో అత్యంత కష్టతరమైనది స్పిన్ బౌలింగ్‌ను ఆడటమే. నేను మిడిలార్డర్‌లో వస్తాను కాబట్టి తొలి బంతి నుంచే స్పిన్‌ను ఆడాలి’ అని చెప్పారు.