News December 17, 2024

మరోసారి వర్షం.. ఆగిన ఆట

image

భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌కు వరుణుడు మరోసారి ఆటంకం కలిగించాడు. IND 105/5 స్కోర్ వద్ద ఉండగా వాన మొదలైంది. దీంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. నిన్న కూడా వర్షం వల్ల ఆట పూర్తిగా సాగలేదు. ఉదయం ఎండతో కూడిన పొడి వాతావరణం ఉంటున్నా తర్వాత ఆకాశం మేఘావృతమై వాన పడుతోంది. మరోవైపు వందకే 5 వికెట్లు కోల్పోయిన భారత్‌ గట్టెక్కాలంటే వర్షం కొనసాగాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Similar News

News February 5, 2025

రేపు సీఎల్పీ సమావేశం

image

TG: రేపు కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) సమావేశం కానుంది. మ.3 గంటలకు హైదరాబాద్ మర్రి చెన్నారెడ్డి మానవవనరుల కేంద్రంలో సీఎం రేవంత్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ నిర్ణయాలపై ఎమ్మెల్యేలకు రేవంత్ దిశానిర్దేశం చేయనున్నారు.

News February 5, 2025

ఢిల్లీలో కాంగ్రెస్‌కు శూన్య హస్తమేనా?

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం తప్పదని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మెజారిటీ సంస్థలు BJPకి, మరికొన్ని ఆప్‌కు అధికారం దక్కుతుందని తెలిపాయి. కాగా, దాదాపు అన్ని సర్వేల్లోనూ కాంగ్రెస్‌ ఖాతా తెరవదని చెప్పాయి. 0-3 సీట్లకే ఛాన్స్ ఉందని ఒకట్రెండు తెలిపాయి. దీంతో ఢిల్లీలో కాంగ్రెస్ పని ఖతమైనట్లే అని, ఆప్‌తో పొత్తు పెట్టుకోవాల్సిందని రాజకీయవేత్తలు విశ్లేషిస్తున్నారు.

News February 5, 2025

రేపు జగన్ ప్రెస్‌మీట్

image

AP: మాజీ సీఎం వైఎస్ జగన్ రేపు కీలక ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడతారు. రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలు, ప్రజా సమస్యలపై ఆయన ప్రసంగిస్తారు. కాగా ఇవాళ విజయవాడ కార్పొరేటర్లతో జరిగిన సమావేశంలో జగన్ కూటమి సర్కార్‌పై ఫైర్ అయ్యారు. ఈసారి జగనన్న 2.0 వేరే లెవెల్‌లో ఉంటుందని కూటమి సర్కార్‌ను ఆయన హెచ్చరించారు.

error: Content is protected !!