News December 17, 2024

JPC అంటే ఏంటి?

image

JPC(జాయింట్ పార్లమెంటరీ కమిటీ) పార్లమెంటు ఉభయ‌సభల ప్రతినిధులతో కూడినది. ఇది బిల్లు పరిశీలనతో పాటు సిఫార్సులు చేస్తుంది. వాటిని ప్రభుత్వం పాటించాల్సిన అవసరం లేదు. కమిటీ పదవీకాలం లేదా విధి పూర్తైన తర్వాత రద్దవుతుంది. JPC సభ్యుల సంఖ్య ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది. నేడు జమిలి బిల్లు లోక్‌సభ ఆమోదం పొందగా, JPCకి పంపేందుకు సిద్ధమని అమిత్ షా ప్రకటించారు. JPC సభ్యుల పేర్లపై సాయంత్రానికి క్లారిటీ రానుంది.

Similar News

News July 9, 2025

మూడో టెస్టుకు టీమ్ ప్రకటన.. స్టార్ పేసర్ రీఎంట్రీ

image

భారత్‌‌తో రేపటి నుంచి జరగనున్న మూడో టెస్టుకు ఇంగ్లండ్ ఒక్క మార్పుతో జట్టును ప్రకటించింది. జోష్ టంగ్ ప్లేస్‌లో స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ నాలుగేళ్ల తర్వాత కమ్‌బ్యాక్ ఇస్తున్నారు. దీంతో ENG బౌలింగ్ అటాక్ స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది. లార్డ్స్‌లో గ్రీన్ పిచ్‌ ఉండనుందన్న వార్తల నేపథ్యంలో ఆర్చర్ కీలకంగా మారనున్నారు.
ENG: క్రాలే, డకెట్, పోప్, రూట్, బ్రూక్, స్టోక్స్, స్మిత్, వోక్స్, కార్స్, ఆర్చర్, బషీర్

News July 9, 2025

రేపట్నుంచే మామిడి రైతుల అకౌంట్లో డబ్బుల జమ

image

AP: మామిడి రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు సీఎం చంద్రబాబు రూ.260 కోట్ల నిధుల విడుదలకు నిర్ణయించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూడకుండా ఇవాళ జరిగిన క్యాబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రభుత్వం కిలోకు అదనంగా రూ.4 మద్దతు ధర ప్రకటించి మామిడి కొనుగోళ్లు చేపట్టిందన్నారు. ఆ డబ్బులను రేపటి నుంచి నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించారు.

News July 9, 2025

మంత్రులకు CM చంద్రబాబు వార్నింగ్!

image

AP: YCP దుష్ప్రచారాలతో పాటు అన్ని విషయాలపై మంత్రులు సకాలంలో స్పందించాలని CM CBN సూచించారు. లేదంటే ఇప్పుడున్న మంత్రుల స్థానంలో కొత్తవారు వస్తారని క్యాబినెట్ భేటీలో హెచ్చరించారు. కాగా మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ బాండ్లలో పెట్టుబడులు పెట్టొద్దని 200 కంపెనీలకు YCP ఈ-మెయిళ్లు పెట్టించినట్లు మంత్రి కేశవ్ CM దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యవహారంపై ఆగ్రహించిన CM.. YCP కుట్రలపై విచారణకు ఆదేశిస్తామన్నారు.